Crime News: మహిళా హోంగార్డుపై హెడ్ కానిస్టేబుల్ దుశ్చర్య..
ABN, Publish Date - Dec 13 , 2024 | 09:03 AM
రాజమండ్రి, బొమ్మూరు పోలీస్ స్టేషన్‌లో మహిళా హోంగార్డుగా విధులు నిర్వహిస్తోంది. ఈ నెల 8వ తేదీన ఆమె నైట్ డ్యూటీలో ఉండగా.. అర్ధరాత్రి సమయంలో హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ వచ్చాడు. విధుల్లో ఉన్న మహిళా హోంగార్డుతో అతను అసభ్యంగా మాట్లాడి చెయ్యి పట్టుకునేందుకు యత్నించాడు.
తూర్పుగోదావరి జిల్లా: రాను రాను మహిళలకు రక్షణలేకుండా పోతోంది. . మహిళలకు రక్షణగా ఉండాల్సిన పోలీసు తమ శాఖలోని మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి, బొమ్మూరు పోలీస్ స్టేషన్‌లో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ విషయాన్ని భర్తతో కలిసి ఉన్నత అధికారులకు చెప్పడంతో హెడ్ కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి, సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే...
రాజమండ్రి, బొమ్మూరు పోలీస్ స్టేషన్‌లో మహిళా హోంగార్డుగా విధులు నిర్వహిస్తోంది. ఈ నెల 8వ తేదీన ఆమె నైట్ డ్యూటీలో ఉండగా.. అర్ధరాత్రి సమయంలో హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ వచ్చాడు. విధుల్లో ఉన్న మహిళా హోంగార్డుతో అతను అసభ్యంగా మాట్లాడి చెయ్యి పట్టుకునేందుకు యత్నించాడు. హెడ్ కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తనను ఫోన్‌లో చిత్రీకరించేందుకు మహిళా హోంగార్డు యత్నించడంతో అతను స్టేషన్ నుంచి వెళ్లిపోయాడు. దీంతో బాధిత మహిళా హోంగార్డు తన భర్తతో కలిసి జిల్లా ఎస్పీ నరసింహా కిషోర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో హెడ్ కాని స్టేబుల్‌పై కేసు నమోదుచేసి, సస్పెండ్ చేశారు. అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ రాజమండ్రి, బొమ్మూరు పోలీసు స్టేషన్‌లో నాలుగున్నరేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 8వ తేదీ (ఆదివారం) నైట్ డ్యూటీలో అర్ధరాత్రి వరకు బయట విధులు నిర్వహించాడు. అనంతరం అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 గంటల సమయంలో బొమ్మూరు స్టేషన్‌కు వెళ్లాడు. ఆ సమయానికి స్టేషన్‌లో ఓ మహిళా పీసీ, మరో మహిళా హోంగార్డు విధుల్లో ఉన్నారు. ఓ మహిళ పోలీస్ నిద్రిస్తున్న సమయంలో మహిళా హోంగార్డు ఫోన్ చూసుకుంటోంది. అది గమనించిన హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ ఆమెతో అసభ్యకరంగా మాట్లాడి, చెయ్యి పట్టుకునేందుకు యత్నించాడు. దీంతో ఆమె తన ఫోన్‌లో చిత్రీకరించే ప్రయత్నం చేసి హెచ్చరించడంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడు. బాధితురాలు భర్తతో కలిసి పోలీసు ఉన్నత అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు.
Updated Date - Dec 13 , 2024 | 09:03 AM