వరద ముప్పు లేకుండా చర్యలు చేపట్టాలి
ABN, Publish Date - Sep 11 , 2024 | 12:16 AM
కాకినాడ సిటీ, సెప్టెంబరు 10: గాడేరు, బిక్కవోలు డ్రెయిన్లు, కాలువలకు వరద పోటెత్తిన నేపథ్యంలో కాకినాడ నగరానికి ఎటువంటి వరద ముప్పు లేకుండా చర్యలు చేపట్టాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశించారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమా
అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే వనమాడి
కాకినాడ సిటీ, సెప్టెంబరు 10: గాడేరు, బిక్కవోలు డ్రెయిన్లు, కాలువలకు వరద పోటెత్తిన నేపథ్యంలో కాకినాడ నగరానికి ఎటువంటి వరద ముప్పు లేకుండా చర్యలు చేపట్టాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశించారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మంగళవారం జిల్లా కలెక్టర్, అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. గాడేరు, బిక్కవోలు డ్రెయిన్లు, కాలు వల నుంచి వచ్చే వరద నీరు వల్ల కాకినాడలోని 24,25,26,37,41,43 డివిజన్లకు ము ంపు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల వరద ప్రభావం పడకుండా జలవన రులశాఖ, కార్పొరేషన్ అధికారులు సమన్వయం చేసుకుని అత్యవసర చర్యలు చేప ట్టాలని ఆదేశించారు. సామర్లకోట కెనాల్‌రోడ్డు, ప్రతాప్‌నగర్, వార్ప్‌రోడ్డు, పరదేశ మ్మపేట, నరసింహరోడ్, రిక్షాలపేట, పద్మనాభనగర్ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతం ముస్తఫా రోడ్డు, రాజీవ్‌నగర్‌లో మున్సిపల్ శాఖా మంత్రి నారాయణతో కలిసి సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పర్యటించారు. వరద బాధితులకు అందిస్తున్న ఆహార పంపిణీని పర్యవేక్షించారు.
Updated Date - Sep 11 , 2024 | 12:16 AM