మత్స్యకార పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ABN, Publish Date - Oct 08 , 2024 | 12:54 AM
కాకినాడ సిటీ, అక్టోబరు 7: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ కోరారు. సోమవారం స్థానిక జగన్నాధపురం ఎస్‌ఐఎఫ్‌టీలో ప్రధాన మంత్రి మత్స్య సంపద
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
కాకినాడ సిటీ, అక్టోబరు 7: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ కోరారు. సోమవారం స్థానిక జగన్నాధపురం ఎస్‌ఐఎఫ్‌టీలో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథ కం కింద మెకనైజ్జ్ బోటు ఓనర్లకు ట్రాన్స్‌పాండర్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఒక్కొక్క పరికరం విలువ రూ.21 వేలు కాగా మొత్తం రూ.42 లక్షలు విలువ చేసే 200 పరికరాలు అందజేశారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లా డుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటుతో మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అఽధికారి కరుణాకరరావు, జిల్లా మత్స్యకార సంఘం మాజీ అధ్యక్షుడు బలసాడి రంగారావు, మత్స్యకార నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Oct 08 , 2024 | 12:54 AM