ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పటిష్ట భద్రత నడుమ గణేష్‌ నిమజ్జనాలు

ABN, Publish Date - Sep 11 , 2024 | 12:18 AM

సర్పవరం జంక్షన్‌, సెప్టెంబరు 10: పటిష్టమైన బందోబస్తు నడుమ గణేష్‌ నిమజ్జనాలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోస్టల్‌ సెక్యూరిటీ సూప

సూచనలు ఇస్తున్న మెరైన్‌ ఎస్పీ రవివర్మ

సర్పవరం జంక్షన్‌, సెప్టెంబరు 10: పటిష్టమైన బందోబస్తు నడుమ గణేష్‌ నిమజ్జనాలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోస్టల్‌ సెక్యూరిటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్పీ) రవివర్మ అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లా మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ తనిఖీల్లో భాగంగా కాకినాడ సూర్యారావుపేట, వాకలపూడి బీచ్‌ను పరిశీలించారు. వినాయక చవితి నవరాత్రుల్లో భాగంగా నిమజ్జనం జరిగే 3పాయింట్ల వద్ద తగిన భద్రత బందోబస్తు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. భారీ వినాయక ప్రతిమల నిమజ్జం కోసం క్రేన్లు, విద్యుత్తు తదితర ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిమజ్జనం జరిగే సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచి సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. బీచ్‌లో జరిగే 3 నిమజ్జనం ప్రాంతాలను, మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో తీరప్రాంతంలో జరిగే బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మెరైన్‌ సీఐ రామోహ్మన్‌రెడ్డి, ఎస్‌ఐ ఎస్‌ఐ అప్పారెడ్డి,హెచ్‌సీలు పాల్గొన్నారు.

Updated Date - Sep 11 , 2024 | 12:18 AM

Advertising
Advertising