ఉచితంగా ఆపరేషన్‌లు అభినందనీయం
ABN, Publish Date - Sep 22 , 2024 | 11:44 PM
కాకినాడ రూరల్, సెప్టెంబరు 22: కాకినాడ రూరల్ మండలం చీడిగలో మాజీ సర్పంచ్, టీడీపీ నాయకుడు పితాని అప్పన్న ఆధ్వర్యంలో కిరణ్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఆది వారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్యే పిల్లిఅనంతలక్ష్మి,
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ
కాకినాడ రూరల్, సెప్టెంబరు 22: కాకినాడ రూరల్ మండలం చీడిగలో మాజీ సర్పంచ్, టీడీపీ నాయకుడు పితాని అప్పన్న ఆధ్వర్యంలో కిరణ్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఆది వారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్యే పిల్లిఅనంతలక్ష్మి, రూరల్ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త పిల్లి సత్యనారాయణమూర్తి ముఖ్యఅతిథులుగా పాల్గొని వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ ఇటువంటి వైద్యశిబిరాల వల్ల పేదలు, వృద్ధులకు వైద్యసేవలు సులువుగా అందుతాయని, కంటి పరీక్షలు అనంతరం అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్‌లు చేయడం అభినందనీయమని తెలిపారు. అనంతరం గ్రామంలోని ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నసమారాధనలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించి ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను పంచుతూ 100 రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. టీడీపీ, జనసేన నాయకులు నాగబాబు, శ్రీను, రాంబాబు, శా స్ర్తి, రామకృష్ణ, శివ, మహేష్, చిన్నీ పాల్గొన్నారు.
కాకినాడ డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ ఆవరణలో రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థుల ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రూ.2,60,000తో చేపట్టిన పేదవిద్యారులకు స్కాలర్‌షిప్‌లు, బాలికలకు సైకిళ్లు, మహిళలకు కుట్టుమిషన్లు, వినికిడి యంత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ స భ్యులు జగన్నాధరావు, జనార్ధన్, సురేష్, రమణ, అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.
వస్త్ర సంచుల ఆవిష్కరణ
సర్పవరం జంక్షన్, సెప్టెంబరు 22: గొడారిగుంటలో అడబాల ట్రస్ట్ అధ్యక్షుడు రత్నప్రసాదరావు ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ చిత్రం తో ముద్రించిన వస్త్ర సంచులను ఎమ్మెల్యే పం తం నానాజీ ఆవిష్కరించి ప్రజలకు పంపిణీ చేశారు. రత్నప్రసాదరావును అభినందించారు. కార్యక్రమంలో శిరంగు శ్రీనివాసరావు పాండ్రంకి రాజు, గవర శ్రీరాములు, అడబాల సత్యనారాయణ, మాచవరపు సత్యనారాయణ ఉన్నారు.
Updated Date - Sep 22 , 2024 | 11:44 PM