Kanumuri Bharat: వైసీపీ అరాచక పాలనపై ఎంపీ రఘురామ ప్రాణాన్ని పణంగా పెట్టారు
ABN, Publish Date - Jan 02 , 2024 | 10:08 PM
వైసీపీ ( YCP ) అరాచక పాలనపై ఎంపీ రఘురామకృష్ణంరాజు ( MP Raghuramakrishnam Raju ) ప్రాణాన్ని పణంగా పెట్టి అలుపెరిగిన పోరాటం చేస్తున్నారని ఎంపీ రఘురామ తనయుడు కనుమూరి భరత్ ( Kanumuri Bharat ) తెలిపారు. మంగళవారం నాడు ఉండి మండలం మహదేవపట్నంలో ఎంపీ నిధులతో నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామరాజుతో పాటు కనుమూరి భరత్ పాల్గొన్నారు.
ఏలూరు: వైసీపీ ( YCP ) అరాచక పాలనపై ఎంపీ రఘురామకృష్ణంరాజు ( MP Raghuramakrishnam Raju ) ప్రాణాన్ని పణంగా పెట్టి అలుపెరిగిన పోరాటం చేస్తున్నారని ఎంపీ రఘురామ తనయుడు కనుమూరి భరత్ ( Kanumuri Bharat ) తెలిపారు. మంగళవారం నాడు ఉండి మండలం మహదేవపట్నంలో ఎంపీ నిధులతో నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామరాజుతో పాటు కనుమూరి భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ అరాచక పాలనపై, దుర్మార్గ ప్రభుత్వ పెద్దలపై ఎంపీ రఘురామ అలుపెరిగిన పోరాటం చేస్తున్నారని చెప్పారు. వైసీపీ నేతలతో వద్దని ఎంతమంది సముదాయించిన వినడం లేదన్నారు. జగన్ ప్రభుత్వాన్ని అధికారంలోనుంచి పోతానే ప్రజలకు విముక్తి కలుగుతుందని చెప్పారన్నారు. రాష్ట్రం, ప్రజల బాగుకోసం ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా పోరాడుతున్నారన్నారు. రఘురామకృష్ణం రాజు ‘మీకోసం పోరాడుతున్నారు.. మీరందరూ మద్దతుగా, తోడుగా ఉంటారు’ అని నమ్ముతున్నానని కనుమూరి భరత్ పేర్కొన్నారు.
Updated Date - Jan 02 , 2024 | 10:09 PM