ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎమ్మెల్సీ ఎన్నికల సందడి

ABN, Publish Date - Sep 30 , 2024 | 11:20 PM

ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలైంది. సోమవారం నుంచి ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. పట్టభద్రులైన ఓటర్ల నమోదు ప్రక్రియ ఆరంభమైంది.

(అమలాపురం-ఆంధ్రజ్యోతి): ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలైంది. సోమవారం నుంచి ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. పట్టభద్రులైన ఓటర్ల నమోదు ప్రక్రియ ఆరంభమైంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్విల్లూరుతున్న వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఆశావహులైన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో సోమవారం నుంచి నవంబరు 6వ తేదీ వరకు ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో ఓటర్లు నమోదు చేసుకోవచ్చు. 2019లో జరిగిన ఎన్నికల్లో 2.93 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 1.92 లక్షల మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2025 మార్చిలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నాటికి 3 లక్షలకు పైగా ఓటర్లు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఓట్ల నమోదు ఇలా

డిగ్రీ పూర్తి చేసిన ఎవరైనా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో ఈ ప్రక్రియ చేపట్టడానికి రెవెన్యూ అధికారులు అవకాశమిచ్చారు. దరఖాస్తు చేసుకున్న ఓటర్ల ఇంటికి నేరుగా అధికారులు వచ్చి ధ్రువపత్రాలను అందజేస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే పరిశీలన చేస్తారు. ఫామ్‌-18ను తీసుకుని వివరాలు పూరించి ఆధార్‌కార్డు, డిగ్రీ సర్టిఫికెట్‌ జిరాక్సు, నివాస ధ్రువపత్రం వీటన్నింటినీ కలిపి సెట్‌గా చేసి తహసీల్దార్‌ కార్యాలయంలో అందించాలి. లేదా మీ సేవ కేంద్రాల్లో కూడా నమోదు చేసుకోవచ్చు. ప్రస్తుతం కొత్తగా పట్టభద్రులైన వారు తమ ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అదే విధంగా వివిధ రాజకీయ పార్టీల నుంచి పోటీ చేయాలనుకునే ఆశావహులైన అభ్యర్థులు కూడా కొత్త ఓటర్లను చేర్పించే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు.

ఆశావహులు పలువురు

వివిధ రాజకీయ పార్టీల తరుపున పోటీ చేసేందుకు ఆశావహులైన అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు అమరావతి కేంద్రంగా లాబీయింగ్‌లు నడుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఐ.పోలవరం మండలానికి చెందిన సీనియర్‌ టీడీపీ నాయకుడు పేరాబత్తుల రాజశేఖర్‌, అమలాపురం పట్టణానికి చెందిన మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు తనయుడు మెట్ల రమణబాబు టిక్కెట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక జనసేన నుంచి అమలాపురం పట్టణానికి చెందిన మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ యాళ్ల నాగసతీష్‌ జనసేన పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. వీరితో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన మరికొంతమంది నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగనున్నట్టు సమాచారం. వీరితో పాటు వైసీపీ, కాంగ్రెస్‌లతో పాటు ఉపాధ్యాయ సంఘాల నుంచి కమ్యూనిస్టు పార్టీల నుంచి కూడా ఆశావహులైన అభ్యర్థులు ఎన్నికల్లో దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated Date - Sep 30 , 2024 | 11:21 PM