పలుచోట్ల స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు
ABN, Publish Date - Oct 03 , 2024 | 12:12 AM
తాళ్లరేవు, అక్టోబరు 2: ప్రతీ ఒక్కరు స్వచ్ఛతా హీసేవాలో భాగస్వాములైతే గ్రామాలు పచ్చగా ఉండి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ఎమ్మెల్యేదాట్ల బుచ్చిబాబు అన్నారు. బుధవారం చొల్లంగిపేట గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ పద్మావతి అధ్యక్షతన స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. గాంధీజీ, లాల్‌బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళిలర్పిం చారు. గురుకులంలో విద్యార్థుల సమస్యలను ఎ మ్మెల్యే, ఎంపీ హరీష్ మాధుర్ అ
తాళ్లరేవు, అక్టోబరు 2: ప్రతీ ఒక్కరు స్వచ్ఛతా హీసేవాలో భాగస్వాములైతే గ్రామాలు పచ్చగా ఉండి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ఎమ్మెల్యేదాట్ల బుచ్చిబాబు అన్నారు. బుధవారం చొల్లంగిపేట గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ పద్మావతి అధ్యక్షతన స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. గాంధీజీ, లాల్‌బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళిలర్పిం చారు. గురుకులంలో విద్యార్థుల సమస్యలను ఎ మ్మెల్యే, ఎంపీ హరీష్ మాధుర్ అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపల్ పద్మావతి పాఠశాలలో సమస్యలు, ఇబ్బందులను వివరించగా పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. పాఠశాల ఆవరణలో చీపుర్లను చేతపట్టుకుని పరిశుభ్రత చేశారు. ఎంపీపీ రాయుడు సునీత, టీడీపీ నేతలు టేకుమూడి లక్ష్మణరావు, మందాల గంగసూర్యనారాయణ, ధూళిపూడి వెంకటరమణ, వాడ్రేవు వీరబాబు, పొన్నమండ రామలక్ష్మి, పెమ్మాడి కృష్ణవేణి, మం దాల సత్తిబాబు,కట్టా త్రిమూర్తులు పాల్గొన్నారు.
సామర్లకోట: పట్టణంలోని నీలమ్మ చెరువు పరిసరాల్లో చెత్త చెదారాలను ఏరివేసేందుకు మున్సిపాల్టీ ఆద్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. కమిషనర్ శ్రీవిద్య ఆధ్వర్యంలో చైర్‌పర్సన్ అరుణ చీపుర్లు చేతబట్టి నీలమ్మ చెరువు వాకింగ్ ట్రాక్‌ను శుభ్ర పరిచారు. కూటమి నాయకులు, పలవురు కౌన్సి లర్లు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది ఉన్నారు.
అన్నవరం: రత్నగిరిపై చేపట్టిన స్వచ్చతా హీ సేవా పక్షోత్సవాలు బుధవారంతో ముగిశాయి. చివరిరోజున దేవస్థానం ఉద్యోగులు సత్యగిరి కొండపై హరిహరసదన్ ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో మొక్కలు నాటారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, సహాయకమిషనర్ సీహెచ్ రామ్మోహనరావు కార్యక్రమం ప్రారంభించగా ఉద్యోగులు వాటిని నాటారు. మొక్కల సంరక్షణకు ప్రత్యేకచర్యలు తీసుకుంటున్నట్టు గార్డెన్ సూపరెంటెండెంట్ ఐవీ రామారావు తెలిపారు.
గండేపల్లి: సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీ ఎన్‌ఎస్ ఎస్ విద్యార్థులు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా కాకినాడ ఎన్టీఆర్ బీచ్ సాగర తీరంలో ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరించి పరిసరాలు శుభ్రం చేసినట్టు యూనివర్శిటీ డిప్యూటీ ప్రో చాన్సలర్ డాక్టర్ ఎం.శ్రీనివాసరెడ్డి తెలిపారు. జేఎన్‌టియూ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ జి.శ్యామ్‌కుమార్, బి.రాంబాబు, పరిణయ శ్రీ, ప్రశాంతి పాల్గొన్నారు. సూరంపాలెం పవర్ గ్రిడ్ సంస్థలో రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. పవర్‌గ్రిడ్ డీజీఎం పవన్‌కుమార్, డాక్టర్ సీహెచ్ కిరణ్మయి, హెచ్‌ఆర్ మేనేజర్ కోటేశ్వరరావు, డాక్టర్లు జి.తేజస్విని, సతీష్‌రెడ్డి, హరికృష్ణ, పవర్‌గ్రిడ్ సం స్థ అధికారులు వీరేంద్ర, ఎఎస్‌మూర్తి ఉన్నారు.
పిఠాపురం: పట్టణంలో స్వచ్ఛతా హి సేవా ర్యాలీ నిర్వహించారు. పారిశుధ్య కార్మికుల సేవలను కొనియాడారు. జనసేన పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, మున్సి పల్ కమిషనరు కనకారావు పాల్గొన్నారు. అంత కు ముందు మున్సిపల్ కార్యాలయంలో మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Updated Date - Oct 03 , 2024 | 12:12 AM