Bhuvaneshwari: మునికోటేశ్వరరావు కుటుంబానికి భువనేశ్వరి ధన్యవాదాలు.. ఎందుకంటే?
ABN, Publish Date - Jan 26 , 2024 | 03:42 PM
Andhrapradesh: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో భాగంగా మూడో రోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యానగర్‌లోని అక్కిన మునికోటేశ్వరరావు కుటుంబ సభ్యులకు భువనేశ్వరి ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నప్పుడు నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలకు మునికోటేశ్వరరావు కుటుంబం ఆదరణగా నిలిచింది.
రాజమండ్రి, జనవరి 26: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (TDP Chief Nara Chandrababu Naidu) సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో భాగంగా మూడో రోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యానగర్‌లోని అక్కిన మునికోటేశ్వరరావు కుటుంబ సభ్యులకు భువనేశ్వరి ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నప్పుడు నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలకు మునికోటేశ్వరరావు కుటుంబం ఆదరణగా నిలిచింది. దాదాపు 53 రోజుల పాటు మునికోటేశ్వరరావు నివాసంలోనే భువనేశ్వరి, బ్రాహ్మణిలు ఉన్నారు. కష్ట సమయంలో తమకు మద్దతుగా ఉన్న మునికోటేశ్వరరావు కుటుంబసభ్యులను భువనేశ్వరి కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. భువనేశ్వరి రాకతో మునికోటేశ్వరరావు కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
మూడవ రోజు ‘నిజం గెలవాలి’ కార్యక్రమం ఇలా...
కాగా.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమం మూడవ రోజు కొనసాగింది. శుక్రవారం అనపర్తి నియోజకవర్గం బలభద్రపురం ఎం.ఎస్.ఆర్. ఫంక్షన్ హాల్ విడిది కేంద్రం నుంచి భువనేశ్వరి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అనపర్తి, నిడదవోలు, కొవ్వూరు, రాజానగరం నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటన సాగింది. చంద్రబాబు అరెస్ట్‌తో మనస్తాపం చెంది మరణించిన వారి కుటుంబసభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఐదుగురు కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. ముందుగా రాజమండ్రి బిక్కవోలులో రొక్కాల రాణి కుటుంబసభ్యులను పరామర్శించి మూడు లక్షల రూపాయలు ఆర్థికసాయం అందజేశారు. అనంతరం నిడదవోలు నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటన సాగింది. నిడదవోలు మండలం కలవచర్లలో మన్యం శ్రీనివాసరావు, పందలపర్రులో భోగి రెడ్డి సత్యనారాయణ, తిమ్మరాజుపాలెంలో కుసుమే వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. ఒక్కొక్క కుటుంబానికి మూడు లక్షల రూపాయల చెక్కును ఆర్థిక సాయంగా అందజేశారు. సాయంత్రం 5.30 గంటలకు భువనేశ్వరి మధురపూడి విమానాశ్రయం నుంచి తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు.
బాబు సెంటిమెంట్‌నే ఫాలో అయిన భువనేశ్వరి
చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో నిర్బంధించిన సమయంలో వేదనకు గురై అశువులు బాసిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి ఆర్థిక సాయం అందిస్తున్నారు. కాకినాడ, అమలాపురం, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గాల్లో నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. చంద్రగిరి మండలంలోని నారావారిపల్లె నుంచి నిజం గెలవాలి బస్సు యాత్రను ఆమె ప్రారంభించారు. నారా చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టిన కుప్పం నుంచి ప్రారంభిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబుకు ఇదొక సెంటిమెంట్. దీన్నే టీడీపీ యువనేత నారా లోకేష్ ఫాలో అయ్యారు. యువగళం పాదయాత్రను ఇక్కడి నుంచే ఆరంభించారు. నారా భువనేశ్వరి కూడా కుప్పం నుంచే ‘నిజం గెలవాలి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Jan 26 , 2024 | 03:45 PM