Deputy CM: సోమవారం పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యాటన..
ABN, Publish Date - Nov 04 , 2024 | 08:56 AM
పిఠాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో సోమవారం డిప్యూటీ సీఎం పర్యటించి ఈ రోజు సాయం త్రం తిరిగి పయనం కానున్నారు. ఇందుకు సంబంధించి ఆదివారం సాయంత్రం అధికారికంగా సమాచారం వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పర్యటన తొలుత ఈనెల 4,5వ తేదీల్లో ఉంటుందని ప్రకటించారు. అయితే..
కాకినాడ జిల్లా: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (Deputy CM) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సోమవారం పిఠాపురంలో (Pithapuram) పర్యటించనున్నారు. అయితే ఆయన పర్యటన షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. పవన్ పర్యటనను ఒకరోజుకే కుదించారు. పిఠాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో సోమవారం డిప్యూటీ సీఎం పర్యటించి ఈ రోజు సాయం త్రం తిరిగి పయనం కానున్నారు. ఇందుకు సంబంధించి ఆదివారం సాయంత్రం అధికారికంగా సమాచారం వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పర్యటన తొలుత ఈనెల 4,5వ తేదీల్లో ఉంటుందని ప్రకటించారు. అయితే 5వ తేదీ నాగులచవితి కావడంతో పర్యటనను ఒక్కరోజుకే పరిమితం చేశారు. మారిన షెడ్యూల్ ప్రకారం ఆయన 4న ఉదయం కాకినాడ జిల్లాకు వచ్చి కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం తిరిగి వెళ్లతారు.
నేడు పర్యటన ఇలా...
సోమవారం ఉదయం 8 గంటలకు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి 8.40 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి 9.30 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయం చేరుకుని అక్కడ నుంచి 11.00 గంటలకు గొల్లప్రోలు జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. అక్కడ పిఠాపురం నియోజకవర్గంలోని పాఠశాలలలకు మంజూరైన సైన్స్ ల్యాబ్‌లను, గొల్లప్రోలు పట్టణంలోని మండలపరిషత్ ప్రాథమిక పాఠశాల-2 నూతన భవనాలను ప్రారంభిస్తారు. గొల్లప్రోలు జగనన్న కాలనీకి మంజూరైన బ్రిడ్జి నిర్మాణంతో పాటు సూరంపేటకు మంజూరైన బ్రిడ్జి నిర్మాణానికి, గొల్లప్రోలు బాలుర ఉన్నత పాఠశాల భవనాల మరమ్మతుల పనులకు, అసంపూర్తిగా ఉన్న గొల్లప్రోలు అర్బన్‌హెల్త్ సెంటర్, తహశీల్దారు కార్యాలయ పూర్తికి చేపట్టే పనులకు, గొల్లప్రోలులోని మొగలి సూర్యుడు మంచినీరు చెరువు ఆధునీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అక్కడే విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు పంపిణీ చేయనున్నారు. అక్కడ నుంచి 11.30గంటలకు బయలుదేరి 11.45 గంటలకు పిఠాపురంలోని టీటీడీ కల్యాణమండపం చేరుకుంటారు. అక్కడ నుంచే నూతనంగా నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాలను ప్రారంభిస్తారు. టీటీడీ ఆధ్వర్యంలోని వేంకటేశ్వరస్వామి మాడవీధులు, కల్యాణమండపం మరమ్మతులకు, బాదం మాధవరావు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, ఇంటిగ్రేటెడ్ హాస్టల్ భవనాల మరమ్మతులకు ఆయన శంఖుస్థాపన చేస్తారు. పశువుల సంత ఆధునీకరణ పనులకు శ్రీకారం చుడతారు. అక్కడ నుంచి మధ్యాహ్నం 12.15 గంటలకు బయలుదేరి 12.30 గంటలకు కాకినాడ రూరల్ మండలం పి.వెంకటాపురంలో ఏపీఎస్‌డబ్లూఆర్‌ఈఐ ఇనిస్టిట్యూట్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి 1.30 గంటలకు కొత్తపల్లి పీహెచ్‌సీకి చేరుకుంటారు. పీహెచ్‌సీలో అవుట్ పేషెంట్‌బ్లాకు నిర్మాణానికి, ఇసుకపల్లి, రవీంద్రపురం, నిదానందొడ్డి, శొంటివారిపాకలులోని మండలపరిషత్ పాఠశాల భవనాల నిర్మాణానికి, మూలపేట హాస్టల్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కొత్తపల్లి మండలంలో టీటీడీ కల్యాణమండపం నిర్మాణంపై పవన్ ప్రకటన చేయనున్నారు. అక్క డ నుంచి 2 గంటలకు చేబ్రోలు నివాసానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి సా యంత్రం 5గంటలకు చేరుకుని అక్కడ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లతారు. పవన్ షెడ్యూల్ మారడంతో అందుకు తగ్గట్టుగా ఏర్పా ట్లు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు.
భారీ బందోబస్తు
పవన్ పిఠాపురం నియోజకవర్గ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక డీఎస్పీ, తొమ్మిది మంది సీఐలు, 29 మంది ఎస్‌ఐలు, 78 మంది ఏఎస్‌ఐ, హెచ్‌సీలు, 155 మంది పీసీలు, 18 మంది మహిళా పోలీసులు, 50 మందితో కూడిన 8 స్పెషల్ పార్టీలను వినియోగించనున్నారు. మొత్తం 340 మంది బందోబస్తులో ఉండనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నా ఆత్మహత్య వెనుక అసలు కారణాలు డిప్యూటీ సీఎంకు తెలియాలి..
బాలుర మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు
వారి కోసమే రెడ్‌బుక్.. హోం మంత్రి
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 04 , 2024 | 08:57 AM