ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎంతో కృషి చేసిన ప్రభుత్వం

ABN, Publish Date - Sep 21 , 2024 | 11:39 PM

సామర్లకోట, సెప్టెంబరు 21: గత వైసీపీ ప్రభు త్వ హయాంలో రాష్ట్ర ప్రజలు పడిన ఇబ్బందులు, ఎదుర్కొన్న సమస్యలు తిరిగి పునరావృతం కాకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం అతి స్వల్పకాలం లోనే ఎంతో కృషిచేసిందని, మొదటి వందరోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వంగా గర్తింపు పొందిందని పెద్దా పురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొ న్నారు. సామర్లకోట పట్టణ పరిధిలో 3వ వార్డు నందు మున్సిపాల్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇది మంచి ప్రభుత్వం కా

సామర్లకోటలో మాట్లాడుతున్న రాజప్ప

సామర్లకోట, సెప్టెంబరు 21: గత వైసీపీ ప్రభు త్వ హయాంలో రాష్ట్ర ప్రజలు పడిన ఇబ్బందులు, ఎదుర్కొన్న సమస్యలు తిరిగి పునరావృతం కాకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం అతి స్వల్పకాలం లోనే ఎంతో కృషిచేసిందని, మొదటి వందరోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వంగా గర్తింపు పొందిందని పెద్దా పురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొ న్నారు. సామర్లకోట పట్టణ పరిధిలో 3వ వార్డు నందు మున్సిపాల్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజప్ప హాజరై మాట్లాడుతూ తాను మొదటి సా రిగా ఎన్నికైనకాలంలో నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దానన్నారు. రెండవ దఫా తాను గెలుపొందినప్పటికీ వైసీపీ పాలనలో స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి సూపర్‌ ఎమ్మెల్యేగా వ్యవహరించి అభివృద్ధిని నీరుగార్చి ఐదేళ్లూ తన పదవి కాపాడుకు నేందుకు మాత్రమే ఉన్నాడన్నారు. తిరిగి మూడవ దఫా తాను గెలుపొందడమేగాక మెజార్టీ ప్రజల ఆశించిన మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం తొలి 100 రోజులకే రాష్ట్రం అభివృద్ధి పథం లో పయనించడం అందరూ చూస్తున్నదేనన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, బీజేపీ ఇంచార్జి వెంకటరమణ, మున్సిపల్‌ కమిషనర్‌, తహశీల్దార్‌ కొవ్వూరి చంద్రశేఖరరెడ్డి ప్రసంగించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 11:39 PM