నిర్లక్ష్యాన్ని సహించబోం : ఎమ్మెల్యే రాజప్ప
ABN, Publish Date - Nov 02 , 2024 | 12:21 AM
సామర్లకోట, నవంబరు 1 (ఆంధ్రజ్యో తి): సామర్లకోట కుమార రామ భీమేశ్వరా లయంలో శనివారం నుంచి ప్రారంభం కా నున్న కార్తీకమాస నెల రోజుల ఉత్సవాలకు వచ్చే భక్తులకు సేవలందించడంలో నిర్లక్ష్యా న్ని ఎంతమాత్రం సహించబోమని పెద్దాపు రం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప దేవదాయ, వివి
సామర్లకోట, నవంబరు 1 (ఆంధ్రజ్యో తి): సామర్లకోట కుమార రామ భీమేశ్వరా లయంలో శనివారం నుంచి ప్రారంభం కా నున్న కార్తీకమాస నెల రోజుల ఉత్సవాలకు వచ్చే భక్తులకు సేవలందించడంలో నిర్లక్ష్యా న్ని ఎంతమాత్రం సహించబోమని పెద్దాపు రం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప దేవదాయ, వివిధ శాఖలకు చెందిన అధికా రులను హెచ్చరించారు. భీమేశ్వరాలయం ఆవరణలో శుక్రవారం ఈవో నీలకంఠం ఆధ్వర్యంలో అధికారులతో సమీక్షా సమావే శాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాజ ప్ప మాట్లాడుతూ కోనేరు పుష్కరిణిలో గో దావరి జలాలు నింపే కార్యక్రమం జరుగు తుందని అయితే గోదావరి కాలువలో మహాశివరాత్రి, కార్తీకమాస నెల రోజులలో నూ మురికినీరు సరఫరా అవుతుండడం అత్యంత విచారకరమన్నారు. అయినా ఆ యా శాఖలు ప్రత్యేకశ్రద్ధ కనబర్చి కలుషిత జలాలు విడుదల కాకుండా చర్యలు తీసు కోవాలన్నారు. భక్తుల మనోభావాలకు ము ప్పు వాటిల్లే రీతిలో అధికారులు, సిబ్బంది వ్యవహరించరాదని ఈ విషయంలో అర్చ కులకు అదనపు సిబ్బందిని సైతం నియ మించాలని ఈవోను రాజప్ప ఆదేశించారు. వైద్యఆరోగ్య సిబ్బంది 24 గంటల పాటు ఆలయం వద్ద అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తహశీల్దార్‌ను ఆదేశి ంచారు. జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు మాట్లాడుతూ ఆలయ ఈవో అధి కారి సమయపాలన పాటించకపోవడం వల్ల ఆలయంలో ఏమి జరుగుతుందో ఎవ రికీ తెలియడం లేదని ఆరోపించారు. ఆల య కోనేరు పుష్కరిణిలో నీటి నిల్వల ఎంత మేర పెట్టారో రాజప్ప పరిశీలించి అధికారు లకు సూచనలు చేశారు. కార్యక్రమంలో బీజేపీ ఇంచార్జి వెంకటరమణ, భీమేశ్వరా అన్నదాన ట్రస్ట్ ప్రతినిధి బిక్కిన పరమేశ్వర సాయి సత్యనారాయణ, రైతు సంఘం అధ్యక్షులు కంటే జగదీష్‌మోహన్, భక్తులు పాల్గొన్నారు. అంతకుముందు భీమేశ్వర స్వామి, బాలాత్రిపుర సుందరి అమ్మవార్లను ఎమ్మెల్యే దర్శించి ప్రసాదాలు స్వీకరించారు.
Updated Date - Nov 02 , 2024 | 12:21 AM