ఏలేరు కాలువపై శాశ్వత వంతెన నిర్మాణం
ABN, Publish Date - Oct 05 , 2024 | 12:16 AM
పెద్దాపురం, అక్టోబరు 4: ఏలేరు కాలువపై శాశ్వత వంతెన నిర్మాణానికి కృషి చేయనున్నట్టు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలపారు. మండలంలోని
పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప
పెద్దాపురం, అక్టోబరు 4: ఏలేరు కాలువపై శాశ్వత వంతెన నిర్మాణానికి కృషి చేయనున్నట్టు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలపారు. మండలంలోని కాండ్రకోట గ్రామంలో ఏలేరు కాలువపై తాత్కాలిక వంతెన నిర్మాణానికి ఆయ న శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దబ్బకాలువపై నిర్మిం చిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో రైతు లు ఇబ్బందులు పడ్డారు. దీనిని దృష్టిలో ఉంచు కుని తాత్కాలిక వంతెన నిర్మాణం ప్రస్తుతానికి చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. త్వరలోనే శాశ్వత వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుం టామన్నారు. ఎలిశెట్టి నాని, గవర సాన శివ రామకృష్ణ, ఆర్‌అండ్‌బీ అధికారులు పాల్గొన్నారు.
సామర్లకోట: ఆధ్యాత్మిక కార్యక్రమాల పేరిట ఆయా ఉత్సవ నిర్వాహకులు అన్నదానాలు చేయడం ఎంతో విలువైనదని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పట్టణ పరిధిలో సత్యనారాయణ పురం మినీ వ్యాన్ ఆసోసియేషన్ ఆవరణలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగింపు పురస్కరించుకుని శుక్రవారం ఏర్పాటుచేసిన మహాన్నదానాన్ని ఎమ్మెల్యే వడ్డించి ప్రారంభించారు. సుమారు 2 వేల మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. మినీ వ్యాన్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Updated Date - Oct 05 , 2024 | 12:16 AM