ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పల్లెల అభివృద్ధే లక్ష్యం

ABN, Publish Date - Oct 15 , 2024 | 11:46 PM

సామర్లకోట, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): పల్లెల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మ కాయల చినరాజప్ప అన్నారు. పల్లె పండుగ కా ర్యక్రమంలో భాగంగా మంగళవారం మండలం లోని పనసపాడులో సీసీరోడ్లు నిర్మాణాలకు రాజ ప్ప కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు.

పనసపాడులో సీసీ రోడ్డు నిర్మాణాలకు కొబ్బరికాయ కొట్టిన ఎమ్మెల్యే చినరాజప్ప

పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప, పల్లె పండుగ కార్యక్రమాలు

సామర్లకోట, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): పల్లెల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మ కాయల చినరాజప్ప అన్నారు. పల్లె పండుగ కా ర్యక్రమంలో భాగంగా మంగళవారం మండలం లోని పనసపాడులో సీసీరోడ్లు నిర్మాణాలకు రాజ ప్ప కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. పనస పాడు సర్పంచ్‌ చీకట్ల వెంకటేష్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజప్ప మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డి ప్యూటీ సీఎం పవన్‌ సంయుక్త కృషి మేరకు కేంద్రప్రభుత్వ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు చెప్పారు. నియోజకవర్గ పరిధిలో ఆగస్టు 23న నిర్వహించి న గ్రామ సభల్లో వివిద అభివృద్ధి పనులు గుర్తిం చి తీర్మానాలు చేసిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. అందులో భాగంగా 15 పనులను రూ. 4.80 కోట్ల నిధులతో సీసీ రోడ్లు తొలివిడతగా 9 గ్రామాల్లో చేపడుతున్నట్టు తెలిపారు. మరికొద్ది రోజుల్లో అర్హత ఉన్న కుటుంబాలకు రేషన్‌ కార్డు లు, ఫించన్లు మంజూరు చేసేందుకు ముఖ్య మంత్రి కార్యాచరణ ఇప్పటికే ప్రారంభించార న్నారు. గ్రామంలో రూ.45 లక్షల వ్యయంతో 2 సీసీ రోడ్లు నిర్మాణాలు చేపడుతున్నట్టు సర్పంచ్‌ తెలిపారు. కార్యక్రమంలో డబుల్‌సెవెన్‌ రాజు, డిప్యూటీ తహశీల్దార్‌ కె.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

పల్లెలకు మహర్ధశ : నానాజీ

సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలన తర్వాత కూటమి ప్రభుత్వంలో పల్లెలకు మహర్ధశ వచ్చిందని, పెద్ద ఎత్తున కోట్లాది నిధులతో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టడం జరిగిందని కాకినాడ రూ రల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం నేమాం, వాకలపూడి, వలసపాకల, రమణయ్యపేట గ్రామాల్లో రూ.2.46 కోట్ల ఉపాధి హామీ నిధులతో నిర్మించనున్న పలు సిమ్మెంట్‌ రోడ్లు, డ్రైనేజీలు, కనెక్టింగ్‌ లింక్‌ రోడ్ల నిర్మాణ పనులకు కూటమి నాయకులు పెంకే శ్రీనివాస బాబా, వాసిరెడ్డి ఏసుదాసు, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావులతో కలసి భూమి పూజా నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆగస్టు 22న నిర్వహించిన గ్రామసభలో ప్రజల నుంచి వచ్చి న ప్రతిపాదనల మేరకు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు రూ. 12.36 కోట్లు మంజూరు కావడం జరిగిందన్నారు. గ్రామాల్లో జరుగుతోన్న పనుల్లో ప్రజాభాగస్వామ్యం ఉండాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, డ్వామా పీడీ అడపా వెంకటలక్ష్మి, ఎంపీ డీవో పసుపులేటి శ్రీనివాస్‌, గ్రామ పంచాయతీ కార్యదర్శులు జొన్నాడ నరసింహారావు, పిడుగు పాండురంగారావు, సత్యనారాయణమూర్తి, పార్టీ నాయకులు పోసిన రాము, దాసరి శివ, పెరికల గౌతమ్‌, చొక్కా జగన్‌, మాతా లక్ష్మణ్‌ ఉన్నారు.

Updated Date - Oct 15 , 2024 | 11:46 PM