Pinipe Srikanth: మాజీ మంత్రి విశ్వరూప్ కొడుకు అరెస్ట్..
ABN, Publish Date - Oct 21 , 2024 | 11:57 AM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లిలో వాలంటీర్‌గా పనిచేసే జనుపల్లి దుర్గా ప్రసాద్ అనే యువకుడు హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా గుర్తించిన పోలీసులు వైసీపీ నేత, మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు పినిపే శ్రీకాంత్‌ను అరెస్టు చేశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెండున్నరేళ్ల క్రితం హత్యకు గురైన వాలంటీర్ (Volunteer), దళిత యువకుడు జనుపల్లి దుర్గాప్రసాద్ (Janupalli Durga Prasad) హత్య కేసు (Murder Case)ను పోలీసులు (Police) చేధించారు. ఈ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు పినిపే శ్రీకాంత్ (Pinipe Srikanth)తో పాటు పలువురు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో మృతిడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసులో ఎలాంటి పురోగతి లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు కేసు విచారణ చేశారు. రమేష్ అనే వ్యక్తిని పోలీసులు విచారణ చేయగా హత్య కేసులో పినిపే శ్రీకాంత్ ప్రధాన నిందితుడుగా గుర్తించారు. దీంతో తమిళనాడులోని మధురైలో తలదాచుకున్న శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మధురైలో పినిపే శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి న్యాయమూర్తి ముందు హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై ఏపీకి తరలిస్తున్నారు. శ్రీకాంత్ అరెస్ట్ వ్యవహారంపై పూర్తి స్థాయిలో వెల్లడి కావాల్సి ఉంది.
కాగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లిలో వాలంటీర్‌గా పనిచేసే జనుపల్లి దుర్గా ప్రసాద్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ కేసును విచారణ చేపట్టింది. మాజీ మంత్రి విశ్వరూప్ తనయుడు పినిపే శ్రీకాంత్‌ను పోలీసులు ప్రధాన నిందితుడిగా గుర్తించారు. కోనసీమ ప్రాంతానికి అంబేడ్కర్ పేరు పెట్టిన సమయంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. అదే సమయంలో అయినవిల్లికి చెందిన వాలంటీరు దుర్గాప్రసాద్ 2022 జూన్ 6న హత్యకు గురయిన విషయం తెలిసిందే.
ఈ కేసులో సంబంధించి ఉప్పలగుప్తం మండలానికి చెందిన నిందితుడు, వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్, మృతుడికి స్నేహితుడైన రమేష్‌ను పోలీసులు విచారించారు. హత్య కేసులో అక్టోబర్ 18న రమేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణ సందర్భంగా మరో నలుగురు నిందితులతో పాటు మాజీ మంత్రి పినిపె శ్రీకాంత్ కూడా ఉన్నట్టు గుర్తించి అరెస్టు చేశారు. మృతుడు దుర్గాప్రసాద్, శ్రీకాంత్‌తో కలిసి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవాడు. దుర్గాప్రసాద్‌ను హత్య చేయించాలని భావించిన శ్రీకాంత్.. రమేష్ సహాయం కోరి, మరో నలుగురికి ఆ బాధ్యత అప్పగించినట్లు పోలీసులు గుర్తించారు.
వ్యక్తిగత కక్షతో వాలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్‌ను పినిపే శ్రీకాంత్ హత్య చేయించాడు. తన కుటుంబ సభ్యులకు దుర్గాప్రసాద్ అసభ్యకర మెసేజ్‌లు పంపడంతో కక్ష పెంచుకున్న శ్రీకాంత్ హత్య చేయించినట్లు సమాచారం. రమేష్ రిమాండ్ రిపోర్టు ద్వారా హత్యకు కారణాలు వెల్లడవుతున్నాయి.
రాజకీయ కక్ష సాధింపే: విశ్వరూప్..
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైసీపీ నేత, మాజీ మంత్రి పినేపి విశ్వరూప్ విమర్శించారు. కోనసీమలో కక్ష రాజకీయాలకు కూటమి సర్కార్ ఆజ్యం పోస్తోందని ఆరోపించారు. రాజకీయ కక్షతో తన కుమారుడిని హత్య కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు అరెస్టుపై స్పందించిన ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కావాలనే తన కుమారుడిని హత్య కేసులో ఇరికించారని, హత్య కేసుతో తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. చనిపోయిన వ్యక్తి వైసీపీ కార్యకర్తేనని, ఎఫ్‌ఐఆర్‌లో కూడా తన కొడుకు శ్రీకాంత్ పేరు ఎక్కడా లేదన్నారు. రాజకీయ కక్షతో తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. మధురై ఆలయ సందర్శనకు వెళ్లి వస్తున్న సమయంలో తన కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారని విశ్వరూప్ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీసు అమరవీరులకు అమిత్ షా నివాళులు..
రౌడీలకు సీఎం చంద్రబాబు వార్నింగ్
అతని బ్యాంక్ ఖాతాల్లో కోట్ల కొద్దీ డబ్బు..
జగన్ తీరును తప్పుపడుతున్న నాయకులు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Oct 21 , 2024 | 11:57 AM