ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rave party: తూర్పుగోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం..

ABN, Publish Date - Dec 30 , 2024 | 10:31 AM

తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి సమీపంలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఈ ఘటనలో దాడి చేసిన పోలీసులు 13 మంది వ్యక్తులు, ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. కోరుకొండ మండలం, బూరుగుపూడి జంక్షన్ వద్ద నాగ సాయి ఫంక్షన్ హాల్‌లో ఆదివారం రాత్రి రేవ్ పార్టీ జరిగింది.

తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి సమీపంలో రేవ్ పార్టీ (Rave party) కలకలం (Kalakalam) రేపుతోంది. ఈ ఘటనలో దాడి చేసిన పోలీసులు 13 మంది వ్యక్తులు, ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. కోరుకొండ మండలం, బూరుగుపూడి జంక్షన్ వద్ద నాగ సాయి ఫంక్షన్ హాల్‌లో ఆదివారం రాత్రి రేవ్ పార్టీ జరిగింది. ఫెర్టిలైజర్స్ షాపుల యజమానులు ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు (Special Branch Police) రేవ్ పార్టీపై దాడి చేశారు.13 మంది వ్యక్తులు, ఐదుగురు యువతులు, మూడు కార్లు స్వాధీనం చేసుకుని కోరుకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాజమండ్రి నుంచి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగడంతో రేవ్ పార్టీ బయటపడింది. గోదావరి జిల్లాలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న రేవ్ పార్టీల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి.


అయితే ఈ రేవ్ పార్టీలో అందరూ మద్యం సేవించారని, డ్రగ్స్ వాడలేదని రాజమండ్రి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. రాత్రి అంతా నాగ సాయి ఫంక్షన్ హాల్‌లో పెద్ద సౌండ్‌తో మ్యూజిక్ పెట్టుకుని, డ్యాన్సులు చేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి అధికారులకు వచ్చిన సమాచారం మేరకే పోలీసులు రేవ్ పార్టీపై దాది చేశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇది కక్ష్యా.. శిక్ష్యా.. నిర్లక్ష్యమా..: కేటీఆర్

చంద్రబాబు నాయకత్వంలో బీసీలకు మరోసారి పెద్దపీఠ..

ఏపీ కొత్త సీఎస్ ట్రాక్ రికార్డు ఇదే..

అరబిందో ‘అత్యవసర’ అక్రమాలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 30 , 2024 | 12:15 PM