ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YSRCP: ఇదేం ఖర్మ... వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేకు స్వగ్రామంలోనే తిరుగుబాటు

ABN, Publish Date - Feb 23 , 2024 | 11:36 AM

Andhrapradesh: స్వగ్రామాల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటును ఎదుర్కోక తప్పడం లేదు. జిల్లాలోని రావులపాలెం మండలం గోపాలపురంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి స్వగ్రామంలోనే దళితులు ఎదురుతిరిగారు. గోపాలపురం సిద్దార్థ్ నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలకు ఎమ్మెల్యే తండ్రి పేరు పెట్టడాన్ని దళితులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి.

అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఫిబ్రవరి 23: స్వగ్రామాల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు (YSRCP MLAs) తిరుగుబాటును ఎదుర్కోక తప్పడం లేదు. జిల్లాలోని రావులపాలెం మండలం గోపాలపురంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి (MLA Chirla Jaggireddy) స్వగ్రామంలోనే దళితులు ఎదురుతిరిగారు. గోపాలపురం సిద్దార్థ్ నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలకు ఎమ్మెల్యే తండ్రి పేరు పెట్టడాన్ని దళితులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. శుక్రవారం ఉదయం పాఠశాల పునఃప్రారంభానికి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గ్రామానికి వచ్చారు. అయితే ప్రారంభోత్సవంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేయటంపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి వేసిన పూలమాలలు తీసివేసి అంబేద్కర్ విగ్రహానికి దళితులు క్షీరాభిషేకం చేశారు. దళితుల ఆందోళనతో గ్రామానికి పోలీసులు భారీగా మోహరించారు.

కాగా.. ఇదే గ్రామంలో ఓ హోటల్‌లో పేపర్ ప్లేట్లపై అంబేద్కర్ పోటో ఉండటాన్ని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో గ్రామస్తులపై ఎమ్మెల్యే జగ్గిరెడ్డి తప్పుడు కేసులు బనాయించి జైలులో పెట్టడంపై గత రెండేళ్లుగా ఎమ్మెల్యే జగ్గిరెడ్డిపై దళితులు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 23 , 2024 | 11:36 AM

Advertising
Advertising