Kakinada: చదవటం లేదని విద్యార్థినిని చితకబాదిన టీచర్
ABN, Publish Date - Jul 14 , 2024 | 01:19 PM
కాకినాడ జిల్లా: సరిగా చదవడం లేదంటూ ఓ విద్యార్థినిని ప్రిన్సిపాల్, పీఈటీ టీచర్ చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాకినాడ, చిత్రాడకు చెందిన అమృత జగ్గయ్య చెరువులోని గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. సరిగా చదవడం లేదంటూ విద్యార్థినిని కర్రతో విచక్షణా రహితంగా కొట్టారు.
కాకినాడ జిల్లా: సరిగా చదవడం లేదంటూ ఓ విద్యార్థినిని ప్రిన్సిపాల్ (Principal), పీఈటీ టీచర్ (PET Teacher) చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాకినాడ (Kakinada), చిత్రాడకు (Chitrada) చెందిన విద్యార్థిని అమృత జగ్గయ్య చెరువులోని గురుకుల పాఠశాల (Gurukula Pathasala)లో 7వ తరగతి (7th Class) చదువుతోంది. సరిగా చదవడం లేదంటూ విద్యార్థినిని కర్రతో విచక్షణా రహితంగా కొట్టారు. దీంతో బాలికకు నడుము, వెన్నెముకపై గాయాలయ్యాయి. బాలిక స్పృహతప్పి పడిపోయిందంటూ ఆస్పత్రిలో చేర్పించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వెన్నెపూస గాయం కారణంగా 7 నెలులుగా మంచానికే పరిమితమైందని బాలిక తల్లిండ్రులు ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపాల్, పీఈటీ టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పిల్లలకు సహనంతో, ఓర్పుతో విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే దారితప్పి ఆగ్రహంతో బాలికను విచక్షణా రహితంగా చితక్కొట్టారు. అయితే ఈ ఘటన గత ఏడాది డిసెంబర్ నెలాఖరులో చోటు చేసుకుంది. క్లాసులో చెప్పిన పాఠాలు సరిగా చెప్పలేదంటూ కర్రతో బాలిక నడుముపై ప్రిన్సిపాల్, పీఈటీ టీచర్ కొట్టారు. తర్వాత 24 గంటలపాటు గురుకుల పాఠశాలలో బంధించారని సమాచారం. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థినిని స్థానికంగా ఓ ఆస్పత్రిలో చేర్చిన తర్వాత ఇంటికి పంపించారు. అయితే ఏడు నెలల నుంచి బాలిక మంచపైనే ఉందని, ఆస్పత్రికి తీసుకువెళ్లిన ప్రయోజనం లేకపోయిందని బాలిక తల్లిదండ్రులు ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డకు న్యాయం చేయాలని కోరుతూ గురుకుల పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. అయితే తాము బాలికను ఏమీ చేయలేదని ఈ ఏడాది ఏప్రిల్ వరకు బాలిక పాఠశాలకు వచ్చి వెళ్లిందని, తమ తప్పు ఏమీ లేదని ప్రిన్సిపాల్, పీఈటీ టీచర్ సమర్థించుకున్నారు. ఈ క్రమంలో తమ బిడ్డకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రభుత్వం పంతాలు, పట్టింపులు, బేషజాలకు పోకుండా..:
కాసేపట్లో తెరుచుకోనున్న పూరీ ఆలయ రత్నభాండాగారం..
కృష్ణా జిల్లా: మగ శిశువును ఎత్తుకెళ్లిన మహిళ
పోలీసు బలగాలను క్రూరంగా ప్రయోగించారు: యనమల
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 14 , 2024 | 01:19 PM