ప్రతీ ఇంటికి రక్షిత తాగునీరు : ఎమ్మెల్యే దివ్య
ABN, Publish Date - Sep 14 , 2024 | 12:37 AM
తొండంగి, సెప్టెంబరు 13: నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికి రక్షిత తాగునీరందించడమే తన లక్ష్యమని తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. శుక్రవారం ఆ
తొండంగి, సెప్టెంబరు 13: నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికి రక్షిత తాగునీరందించడమే తన లక్ష్యమని తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. శుక్రవారం ఆమె గోపాలపట్నంలో నూతనంగా నిర్మించనున్న రక్షిత మంచినీటి పథ కానికి శుంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ నియోజకవర్గంలో అవసరమైనమేర ట్యా ంకులు నిర్మించి నీరందించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత యనమల రాజేష్, కొయ్యా రామకేశవ, మోతుకూరి వెంకటేష్, సుర్ల లోవరాజు, చిం తంనీడి అబ్బాయి, టీడీపీ జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షుడు కోడ వెంకటరమణ, జనసేన నేత బెండపూడి నాయుడు, టీడీపీ మండలాధ్యక్షులు చొక్కా అప్పారావు, యడ్ల సూరిబాబు ఉన్నారు.
తుని రూరల్: రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తుని ఎమ్మెల్యే యనమల దివ్య స్పష్టం చేశారు. ఆయిల్‌ఫామ్ తోటల విస్తరణ మాస ఉత్సవాల్లో భాగంగా డి.పోలవరంలో పతాంజలి ప్రతినిధులు నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మె ల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎల్.మల్లికార్జునరావు, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు, పతాంజలి ఏజీఎం పట్టాభిరామిరెడ్డి, రవీంద్ర, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు సుర్ల లోవరాజు, పలక సోమేశ్వరరావు, పీడీ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 14 , 2024 | 12:37 AM