ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Selfie video: ‘నన్ను చంపేసేలా ఉన్నారు.. కాపాడండి’

ABN, Publish Date - Nov 20 , 2024 | 11:17 AM

కాకినాడ: పొట్టకూటి కోసం కువైట్‌కు వెళ్లిన ఓ ఏపీ మహిళ అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. కువైట్‌లో పనిలో పెట్టుకున్న యజమాని పని చేయించుకుని సరిగా భోజనం పెట్టక చిత్రహింసలకు గురి చేస్తుండటంతో.. ఆమె తన బాధను వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘నన్ను చంపేసేలా ఉన్నారు.. కాపాడండి’ అంటూ కాకినాడ జిల్లా, గండేపల్లి మండలం, ఎల్లమెల్లికి చెందిన కుమారి అనే మహిళ కువైట్ నుంచి వీడియో విడుదల చేసింది. కువైట్ వెళ్లి అక్కడ పడుతున్న చిత్రహింసలపై రహస్యంగా వీడియో తీసి తన బంధువులకు పంపింది. ‘నాకు సరిగా తిండి పెట్టడంలేదు, చంపేసేలా ఉన్నారు.. నన్ను కాపాడి పిల్లల వద్దకు చేర్చాలంటూ' మహిళ కన్నీటి పర్యంతమవుతోంది. గండేపల్లి మండలం, యల్లమిల్లి గ్రామానికి చెందిన కుమారికి 19 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. భర్త వెంకటేశ్ ఐదేళ్ల క్రితం మృతి చెందడంతో సంపాదన చాలక కువైట్ వెళ్లాలని నిర్ణయించుకుని.. పాలకొల్లుకు చెందిన ఎం.సుధాకర్ అనే ఏజెంట్ సహాయంతో కువైట్‌లో ఓ ఇంట్లో పనిమనిషిగా ఉద్యోగంలో చేరింది. కువైట్ వెళ్లిన ఏడు నెలల కాలంలోనే తాను పలు సమస్యలు ఎదుర్కొంటూ, చిత్రహింసలకు గురవు తున్నట్టు వీడియో ద్వారా బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తనను ఎలాగైనా కాపాడాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటోంది.


కాగా పొట్ట కూటి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన ఎందరో తెలుగువాళ్లు మోసపోతున్నారు. అక్కడ కష్టాల్లో కూరుకుపోతున్నారు. ఇలాంటి బాధితులను ఆదుకునేందుకు మంత్రి నారా లోకేశ్‌ ఆపన్న హస్త అందిస్తున్నారు. వారి చీకటి జీవితాల్లో వెలుగులు నింపేందుకు సాయం చేస్తున్నారు. తన దృష్టికి వస్తున్న సమస్యలపై వెంటనే స్పందిస్తున్నారు. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఏజెంట్ల ద్వారా మోసపోయి గల్ఫ్‌లో చిక్కుకున్న దాదాపు 20 మందిని స్వస్థలాలకు రప్పించారు. తాము ఇబ్బందుల్లో ఉన్నామని వాట్సాప్‌, ఎక్స్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా మెసేజ్‌లు పంపిన వారికి అండగా నిలిచారు. ప్రభుత్వ పరంగానే కాక టీడీపీకి అనుబంధంగా పని చేసే ఎన్నారై టీడీపీ బృందాలను రంగంలోకి దించి కష్టాల నుంచి గట్టెక్కించారు. ఇలా లోకేశ్‌ నుంచి సాయం పొందిన బాధితులు.. ముగిసి పోయిందనుకున్న తమ జీవితాల్లో ఆయన వెలుగులు నింపారని అంటున్నారు.

జీవితాంతం గుర్తు పెట్టుకుంటా

హౌస్‌ మెయిడ్‌ పని కోసం ఏజెంట్‌ ద్వారా ఒమన్‌కు వెళ్లాక రాత్రింబవుళ్లు పని చేయించేవారు. ముక్కు, నోటి నుంచి రక్తం వచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. ఏజెంట్లు నన్ను మోసం చేసిన విషయాన్ని నా మామ, మరిదికి ఫోన్‌లో తెలియజేశాను. మా కుటుంబసభ్యులు రాజానగరంలో టీడీపీ నేతల ద్వారా ఈ విషయాన్ని మంత్రి లోకేశ్‌కు తెలియజేశారు. ఆయన ఎన్నారై టీడీపీ నాయకులు చెప్పడంతో వారు నేనున్న ప్రాంతాన్ని గుర్తించారు. తనకు లక్ష ఇస్తే కానీ నన్ను వెనక్కి పంపనంటూ అక్కడి ఏజెంట్‌ చెప్పారు. దీంతో ఆ దేశంలోని ఎంబసీతో మాట్లాడి నన్ను స్వస్థలానికి పంపారు. మంత్రి లోకేశ్‌ చేసిన సాయం జీవితాంతం గుర్తు పెట్టుకుంటా. - కొత్తపల్లి ప్రియాంక,

రఘునాథపురం, తూర్పుగోదావరి జిల్లా లోకేశ్‌ చొరవతో స్వస్థలానికి... ఇంట్లో పని చేయడానికి అని చెప్పి సౌదీ అరేబియాకు తీసుకెళ్లి ఎడారిలో గొర్రెలు, ఒంటెలకు కాపలా పెట్టారు. సరైన భోజనం పెట్టేవారు కాదు. నోటి వెంట రక్తం వచ్చినా పట్టించుకోలేదు. నా పరిస్తితిని తెలియజేస్తూ సెల్‌లో వీడియో తీసి మిత్రులకు పంపాను. వారు ఎక్స్‌ ద్వారా మంత్రి లోకేశ్‌కు తెలిపారు. ఆయన వెంటనే స్పందించి ఎన్నారై టీడీపీ వారిని నా వద్దకు పంపారు. ఎంబసీతో మాట్లాడి నేను మళ్లీ స్వస్థలం రావడానికి సాయం చేశారు. లోకేశ్‌ మేలు జీవితంలో మర్చిపోలేను. - సరెళ్ల వీరేంద్రకుమార్‌, ఇసుకపూడి, తూర్పుగోదావరి జిల్లా

కువైట్‌కు వెళ్లి మోసపోయా

నెలకు రూ.52 వేలు జీతం ఇస్తారని, వంట పని చేయాలని చెబితే ఏజెంట్‌ ద్వారా కువైట్‌ వెళ్లాను. తీరా అక్కడకు వెళ్లాక హౌస్‌ మెయిడ్‌ పని అప్పగించడంతో నేను మోసపోయానని తెలిసింది. రోజుకు 20 గంటలకుపైగా పని చేయించేవారు. అంతేగాక జీతం రూ.22 వేలే ఇచ్చారు. విరామం లేకుండా పని చేయించడంతో నా ఎడమ చేయి నరం దెబ్బతింది. నా కష్టాలను నా భర్తకు చెప్పాను. ఆయన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ద్వారా మంత్రి లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఏపీ ఎన్నార్టీ, ఎన్నారై టీడీపీ వారిని అప్రమత్తం చేశారు. ఎన్నారై టీడీపీ వారు ఎంబసీ, ఏజెంట్లతో మాట్లాడి నన్ను స్వస్థలానికి పంపే ఏర్పాట్లు చేశారు. అక్కడ తీవ్ర అనార్యోగం పాలైన నేను హైదరాబాద్‌లో వైద్యం చేయించుకున్నాను. మంత్రి లోకేశ్‌కు మా కుటుంబం రుణపడి ఉంటుంది. - నమిడి ప్రమీల, అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా


ఈ వార్తలు కూడా చదవండి..

గంటన్నరపాటు ఆగిపోయి.. మళ్లీ కొట్టుకున్న గుండె..

రష్యా-ఉక్రెయిన్ వార్‌లో కీలక పరిణామం

వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి..

పోలవరం గేమ్‌ చేంజర్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 20 , 2024 | 11:17 AM