ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Government Education : వెనుకబడింది!

ABN, Publish Date - Dec 09 , 2024 | 05:12 AM

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో చాలాచోట్ల మౌలిక సదుపాయాలు ఉంటే సరైన ఫలితాలు లేవు. అభ్యసన ఫలితాలు బాగున్న చోట సదుపాయాలు అంతంతమాత్రంగా ఉంటున్నాయి.

  • ఒక్క పాఠశాలకూ దక్కని 5 స్టార్‌ రేటింగ్‌

  • నాలుగు స్టార్లు దక్కిన బడులూ తక్కువే

  • ఎక్కువగా రెండు, మూడు స్టార్లకే పరిమితం

  • ఏకంగా 398 బడులకు జీరో స్టార్‌ రేటింగ్‌

  • సర్కారు స్కూళ్లలో సదుపాయాల లేమి

  • అంతంతమాత్రంగానే అభ్యసన ఫలితాలు

  • జగన్‌ ప్రభుత్వ నిర్వాకంతో దీనస్థితిలోకి

విద్యారంగంలో సంస్కరణల పేరుతో జగన్‌ ప్రభుత్వం చేసిన విధ్వంసం పాఠశాలలను దీనస్థితిలోకి నెట్టేసింది. చదువులను గాలికొదిలి టోఫెల్‌, బైజూస్‌, సీబీఎ్‌సఈ, ఇంటర్నేషనల్‌ సిలబస్‌ అంటూ చేసిన ప్రయోగాలు విద్యా ప్రమాణాలను దారుణంగా దెబ్బతీశాయి. విద్యార్థుల హాజరు, ఫలితాలను పట్టించుకోకుండా టీచర్లకు బోధనేతర బాధ్యతలు అప్పగించడంతో పాటు బోధన సమయాన్ని తగ్గించడంతో పిల్లల చదువులు అటకెక్కాయి. ‘నాడు-నేడు’తో ప్రభుత్వ పాఠశాలల స్వరూపమే మార్చేస్తామని ప్రగల్భాలు పలికినా.. ఆ పనులు అసంపూర్తిగా వదిలేయడంతో బడుల్లో మౌలిక సదుపాయాలూ అంతంతమాత్రంగానే ఉన్నాయని తేలిపోయింది. గత ప్రభుత్వం తీరుతో ఇప్పుడు పాఠశాలలు సింగిల్‌ స్టార్‌ దక్కించుకోవడానికే ఆపసోపాలు పడుతున్నాయి.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో చాలాచోట్ల మౌలిక సదుపాయాలు ఉంటే సరైన ఫలితాలు లేవు. అభ్యసన ఫలితాలు బాగున్న చోట సదుపాయాలు అంతంతమాత్రంగా ఉంటున్నాయి. కొన్నిచోట్ల అసలు ఈ రెండూ లేవు. అటు మౌలిక సదుపాయాలు, ఇటు ఫలితాల్లో అత్యుత్తమంగా నిలిచిన బడి రాష్ట్రంలో ఒక్కటీ లేదు. కూటమి ప్రభుత్వం తాజాగా చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వెలుగు చూసింది. ప్రభుత్వ, ఎయిడెడ్‌ బడుల స్థితిగతులను తెలుసుకునేందుకు మౌలిక సదుపాయాలు, అభ్యసన ఫలితాల (లెర్నింగ్‌ అవుట్‌కమ్స్‌)కు ప్రభుత్వం స్టార్‌ రేటింగ్‌ను ప్రకటించింది. ఏ బడి ఏ స్థాయిలో ఉంది? అనే కోణంలో వివరాలు సేకరించడంతో ఇప్పటివరకూ వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రచారం అంతా ఉత్తదేనని తేలిపోయింది.బడుల్లో మౌలిక సదుపాయాలకు 5 స్టార్లు, అభ్యసన ఫలితాలకు 5 స్టార్లు ప్రామాణికంగా ఈ అధ్యయనం నిర్వహించారు.


రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలు 45,087 ఉంటే... వాటిలో ఏ ఒక్కటి కూడా కనీసం ఒక విభాగంలోనూ ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ సాధించలేకపోయింది. మరోవైపు సదుపాయాల్లో 87, అభ్యసన ఫలితాల్లో 311 బడులకు అసలు రేటింగే దక్కని (జీరో రేటింగ్‌) దారుణమైన స్థితిలో ఉన్నాయి.

  • సొంత భజనతో సరి

రాష్ట్రంలోని ప్రభుత్వ బడులను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దినట్లు గత వైసీపీ ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేసుకుంది. ‘నాడు- నేడు’తో బడి స్వరూపాన్ని మార్చేశామని జగన్‌ పదే పదే సొంత భజన చేసుకున్నారు. తీరా ఇప్పుడు మౌలిక సదుపాయాల విభాగంలో ఒక్క పాఠశాల కూడా ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ సాధించలేకపోయింది. అదేవిధంగా అఽభ్యసన ఫలితాల్లో సైతం ఒక్కటీ ఫైవ్‌ స్టార్‌ సాధించకపోగా, కేవలం 41 పాఠశాలలు మాత్రమే ఫోర్‌ స్టార్‌ సాధించాయి. మిగిలిన 45 వేల పైచిలుకు బడులన్నీ త్రీ స్టార్‌, అంతకంటే తక్కువ స్థాయికే పరిమితమయ్యాయి.

  • స్టార్‌ రేటింగ్‌ ఇలా...

మౌలిక సదుపాయాల విభాగంలో రేటింగ్‌ కోసం 18 అంశాలను ప్రామాణికంగా తీసుకున్నారు. బడిలో మరుగుదొడ్లు, ల్యాబ్‌లు, క్రీడా మైదానం, ప్రహరీ, గ్రంథాలయం, ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌, తరగతి గదులు, తాగునీరు తదితరాలను పరిశీలించారు. ఒక్కో అంశానికి 5 చొప్పున గ్రేడింగ్‌ ఇచ్చారు. వీటిలో 90 శాతం గ్రేడింగ్‌ సాధించిన బడులకు 5 స్టార్లు కేటాయించారు. 30 కంటే తక్కువ ఉంటే ఒక స్టార్‌ ఇచ్చారు. అభ్యసన ఫలితాల విభాగంలో ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరు, గతేడాది పదో తరగతి పరీక్షల పలితాలు, ఇటీవల జరిగిన సమ్మేటివ్‌ అసె్‌సమెంట్‌ పరీక్షల ఫలితాలను, ఒకవేళ పదో తరగతి లేకపోతే ఫార్మేటివ్‌ అసె్‌సమెంట్‌ పరీక్షల ఫలితాలను ప్రామాణికంగా తీసుకున్నారు. ఈ నాలుగు విభాగాల్లో హాజరుకు 40 శాతం, ఫలితాలకు 60 శాతం గ్రేడింగ్‌ ఇచ్చారు. రెండూ కలిపి 90 శాతం దాటిన బడులకు ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ ఇచ్చారు. అంతకంటే తక్కువ ఫలితాలున్న బడులకు 1 నుంచి 4 స్టార్లు కేటాయించారు.


  • అన్ని జిల్లాల్లోనూ అదే తీరు

ప్రభుత్వ పాఠశాలల స్థితి దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ ఒకేలా ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ జిల్లాలో 2,913 బడులకు గాను 161 చోట్ల మాత్రమే మౌలిక సదుపాయాలు ఫరవాలేదన్నట్టుగా ఉన్నాయి. అయితే అభ్యసన ఫలితాలు మాత్రం దిగజారిపోయాయి. ఈ విభాగంలో ఒక్క బడి కూడా నాలుగు స్టార్లు సాధించలేదు. అనకాపల్లి, అనంతపురం, బాపట్ల, కాకినాడ, కర్నూలు, ఎన్టీఆర్‌, నెల్లూరు, శ్రీసత్యసాయి, విశాఖ జిల్లాల్లోనూ ఒక్క పాఠశాలకూ నాలుగు స్టార్లు దక్కలేదు. ఎక్కువ పాఠశాలలు రెండు, మూడు స్టార్లతోనే సరిపెట్టుకున్నాయి.

  • ఫలితాల్లేని సదుపాయాలెందుకు?

వైసీపీ ప్రభుత్వం బడులను రాజకీయ ప్రచారానికి వాడుకుంది. విద్యార్థుల హాజరు, వారి పరీక్షల ఫలితాలను గాలికొదిలేసింది. నాడు-నేడు పేరుతో బడులకు రంగులు, కుర్చీలు, బెంచీలు అంటూ బోధనను నిర్లక్ష్యం చేసింది. టీచర్లకు నాడు- నేడు పనులు, మరుగుదొడ్లు ఫొటోల బాధ్యతలు అప్పగించి బోధన సమయాన్ని తగ్గించింది. దీనిపై అప్పట్లో ఉపాధ్యాయులు గగ్గోలు పెట్టారు. కానీ జగన్‌ ప్రభుత్వం వారి ఆందోళనలను పెడచెవిన పెట్టింది. పాఠశాల విద్య అంటే నాడు- నేడు పథకం ఒక్కటేనన్నట్టుగా మార్చేసి, ఫలితాలను దిగజార్చింది.

Updated Date - Dec 09 , 2024 | 05:17 AM