Jagan: జగన్ అక్రమాస్తుల కేసులు మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న కేసులో ట్విస్ట్
ABN, Publish Date - May 10 , 2024 | 11:47 AM
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ(ap elections 2024) కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే జగన్(Jagan mohan reddy) అక్రమాస్తుల కేసులు మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఎంపీ రఘురామ కృష్ణ రాజు(raghurama krishnam raju) దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ వాయిదా పడింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ(ap elections 2024) కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే జగన్(Jagan mohan reddy) అక్రమాస్తుల కేసులు మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఎంపీ రఘురామ కృష్ణ రాజు(raghurama krishnam raju) దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. ఈ క్రమంలో రఘురామ తరపు న్యాయవాది సీబీఐ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిందని కోర్టుకు చెప్పగా, ఈ కేసు ఐదు, పది నిమిషాల్లో విని నిర్ణయం తీసుకునేది కాదని జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు. ఈ కేసులో చాలా అంశాలు ఉన్నాయని సంజీవ్ ఖన్నా అన్నారు.
ఈ నేపథ్యంలో కేసు విచారణను ఆగస్టు 5 నుంచి ప్రారంభమయ్యే వారంలో విచారణ చేపడుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక ఇప్పట్లో ఈ కేసు(case) గురించి విచారణ వచ్చే అవకాశం లేదు. మరోవైపు డిశ్చార్జ్ పిటిషన్లపై కూడా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని, కొత్త జడ్జికి తగిన ఆదేశాలు ఇవ్వాలని రఘురామ తరపు న్యాయవాది కోరారు. ఆ విషయాలు జడ్జి దృష్టికి తీసుకువెళ్లాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం సూచించింది.
అయితే ఎన్నికల వేళ ఈ తీర్పు వెలువడుతుందని ఆశించిన పలువురికి మాత్రం నిరాశ ఎదురైందని చెప్పవచ్చు. ధర్మాసనం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొనగా తీర్పు మాత్రం వాయిదా పడింది. ఇక దేశవ్యాప్తంగా 2024 లోక్‌సభ ఎన్నికల(lok sabha election 2024) నాలుగో దశ మే 13న జరగనుండగా, ఇదే రోజు ఏపీ(ap)లో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటి ఫలితాలు జూన్ 4న విలువడనున్నాయి.
ఇది కూడా చదవండి:
Gold and Silver Rates: అక్షయ తృతీయ సందర్భంగా గుడ్ న్యూస్..తగ్గిన గోల్డ్ ధర
AP Elections: హిందూ, ముస్లింలు నాకు రెండు కళ్లు...: చంద్రబాబు
Read Latest AP News and Telugu News
Updated Date - May 10 , 2024 | 11:50 AM