ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: సాంబ వర్సెస్ సత్య.. వైసీపీ కీలక నేతకు ఘోర అవమానం!

ABN, Publish Date - May 11 , 2024 | 01:19 PM

‘రేయ్‌ సాంబా.. కారు దిగురా..! ఏ ముఖం పెట్టుకుని మా అన్న ఇంటికి వస్తున్నావ్‌..? నీ అంతు చూస్తాం..’ అంటూ.. అసభ్య పదజాలంతో దూషిస్తూ.. దాడికి యత్నించారు. సాంబ కారు అద్దాలు ధ్వంసం చేశారు..

  • ఏ ముఖం పెట్టుకుని మా వద్దకు వచ్చావ్‌?

  • ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డికి అవమానం

  • ఇంట్లోకి లాక్కెళ్లి నిర్బంధించిన అసమ్మతి నాయకులు

అనంతపురం, శింగనమల/నార్పల: అనంతపురం జిల్లా నార్పలలో వైసీపీ (YSR Congress) అసమ్మతి నాయకుడు సత్యనారాయణరెడ్డి ఇంటికివెళ్లిన సిటింగ్‌ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి (Jonnalagadda Padmavathy) భర్త, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డికి ఘోర అవమానం జరిగింది. సాంబను సత్యనారాయణ రెడ్డి అనుచరులు అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి యత్నించారు. ఇంట్లోకి తీసుకెళ్లి నిర్బంధించారు. శింగనమల వైసీపీ అభ్యర్థిగా తనవద్ద టిప్పర్‌ డ్రైవర్‌ గా ఉన్న వీరాంజనేయులుకు సాంబ టికెట్‌ ఇప్పించుకున్నారు. దీన్ని వైసీపీ అసమ్మతివర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యేలు శమంతకమణి, యామినీబాల తదితరులు టీడీపీలో చేరారు. మరికొందరు వైసీపీలోనే కొనసాగుతున్నారు. వీరిలో నార్పల సత్యనారాయణరెడ్డి ఒకరు.


నీ అంతు చూస్తాం!

ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులుతో కలిసి శుక్రవారం నార్పలలో రోడ్‌షో, బహిరంగ సభ నిర్వహించేందుకు సాంబ వెళ్లారు. రోడ్‌షోకు సత్యనారాయణరెడ్డి రాకపోవడంతో.. ఆహ్వానించేందుకు సాంబ ఆయన ఇంటికి వెళ్లారు. సాంబను చూడగానే సత్యనారాయణరెడ్డి వర్గీయులు ఆగ్రహంతో ఊగిపోయారు. ‘రేయ్‌ సాంబా.. కారు దిగురా..! ఏ ముఖం పెట్టుకుని మా అన్న ఇంటికి వస్తున్నావ్‌..? నీ అంతు చూస్తాం..’ అంటూ.. అసభ్య పదజాలంతో దూషిస్తూ.. దాడికి యత్నించారు. సాంబ కారు అద్దాలు ధ్వంసం చేశారు. సాంబశివారెడ్డిని సత్యనారాయణరెడ్డి ఇంట్లోకి తీసుకెళ్లి తలుపులు మూసేశారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. అక్కడే ఉన్న పోలీసులు సత్యనారాయణరెడ్డి అనుచరులను శాంతింపజేశారు. చివరకు సత్యనారాయణరెడ్డిని బుజ్జగించి, బహిరంగ సభకు తీసుకెళ్లారు.

Read Latest AP News And Telugu News

Updated Date - May 11 , 2024 | 01:22 PM

Advertising
Advertising