AP Elections: సీఎం జగన్ రాయలసీమ ద్రోహి: చంద్రబాబు
ABN, Publish Date - Apr 19 , 2024 | 08:39 PM
ఏపీ సీఎం జగన్ పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వాలంటీర్ల జీతాన్ని రూ.10 వేలకు పెంచుతామని చంద్రబాబు ప్రకటించారు. వాలంటీర్లు రాజీనామా చేయొద్దని కోరారు. పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. రైతులకు ఏడాదికి రూ.20 వేలు అందజేస్తామని వెల్లడించారు. ఒక్క డీఎస్సీ కూడా వేయలేదు. యువత భవిష్యత్ నాశనం చేశారని విరుచుకుపడ్డారు.
అనంతపురం: ఏపీ సీఎం జగన్ పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వలంటీర్ల జీతాన్ని రూ.10 వేలకు పెంచుతామని చంద్రబాబు ప్రకటించారు. వలంటీర్లు రాజీనామా చేయొద్దని కోరారు. పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. రైతులకు ఏడాదికి రూ.20 వేలు అందజేస్తామని వెల్లడించారు. అనంతపురం జిల్లాలో గల రాయదుర్గం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ఒక్క డీఎస్సీ కూడా వేయలేదు. యువత భవిష్యత్ నాశనం చేశారు. 52 సీట్లలో 49 సీట్లను వైసీపీని గెలిపించారు.. మరి జగన్ ఏం చేశారని అడిగారు. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి అని విమర్శించారు. ఐదేళ్లలో ఏ ప్రాజెక్టు పూర్తయ్యిందా అని అడిగారు. నీళ్లు వచ్చాయా..? ఏ ఒక్కరికైనా మంచి జరిగిందా అని ప్రశ్నించారు. 2014 నుంచి 2019 వరకు చేసిన పనులు ఏంటో చెప్పేందుకు తాను సిద్దమని చంద్రబాబు ప్రకటించారు. ఈ ఐదేళ్లలో ఏం చేశారో సీఎం జగన్ చెప్పగలరా అని అడిగారు. జగన్ కొంపలు కూల్చే వ్యక్తి, కన్న తల్లికి భారమైన వ్యక్తి జన్మభూమికి భారం కాడా అని జగన్ ను ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం
Updated Date - Apr 19 , 2024 | 09:08 PM