ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election 2024: నరసాపురం ఎంపీ స్థానంపై క్లారిటీ

ABN, Publish Date - Apr 17 , 2024 | 08:43 PM

నరసాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస వర్మ ఖరారైనప్పటికీ ఇక్కడి స్థానాన్ని మార్చవచ్చంటూ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ కీలక పితాని సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస వర్మనే కొనసాగుతారని ఆయన స్పష్టత ఇచ్చారు.

నరసాపురం బీజేపీ (BJP) ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస వర్మ (Srinivas Verma) ఖరారైనప్పటికీ ఇక్కడి స్థానాన్ని మార్చవచ్చంటూ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ కీలక పితాని సత్యనారాయణ (pithani satyanarayana) క్లారిటీ ఇచ్చారు. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస వర్మనే కొనసాగుతారని ఆయన స్పష్టత ఇచ్చారు. అభ్యర్థిని మారుస్తున్నారంటూ కొందరు డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థిని మార్చబోతున్నారంటూ ఆశపడుతున్నవారి కల నెరవేరదని వ్యాఖ్యానించారు.


ఎన్డీయే కూటమి అభ్యర్థుల విజయమే అందరి లక్ష్యంగా ముందుకు సాగాలని టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. నరసాపురం ఆత్మీయ సమావేశంలో ఈ మేరకు పితాని సత్యనారాయణ మాట్లాడారు. కాగా నరసాపురం ఎంపీ స్థానాన్ని మార్చబోతున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణ రాజు టీడీపీలో చేరిన నాటి నుంచి ఈ ప్రచారం మరింత జోరందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఊహాగానాలన్నింటికీ తెరదించుతూ పితాని సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు.

Updated Date - Apr 17 , 2024 | 08:45 PM

Advertising
Advertising