Nimmagadda Ramesh Kumar: ఈ సమయంలో ప్రతిపక్షాలను వేధిస్తే ఎలా?
ABN, Publish Date - May 11 , 2024 | 10:58 AM
రాష్ట్రంలో పోలింగ్ తేదికి 48 గంటలే ఉంది. ఈ సమయంలో ప్రతిపక్షాలను వేధిస్తున్నారని ఏపీ ఎలక్షన్ వాచ్ కన్వీనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. రాయలసీమ పల్నాడులో ప్రతిపక్షాలకు చెందిన కార్యకర్తలను పోలీస్ స్టేషన్‌కు రావాలని నోటీస్‌లు ఇస్తున్నారన్నారు. మరి కొన్ని నియోజకవర్గాల్లో వారిని అరెస్ట్ చేస్తున్నారన్నారు. ఈ చర్య ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఇలా అయితే ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్చగా ఎలా జరుగుతాయని ప్రశ్నించారు
అమరావతి: రాష్ట్రంలో పోలింగ్ తేదికి 48 గంటలే ఉంది. ఈ సమయంలో ప్రతిపక్షాలను వేధిస్తున్నారని ఏపీ ఎలక్షన్ వాచ్ కన్వీనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. రాయలసీమ పల్నాడులో ప్రతిపక్షాలకు చెందిన కార్యకర్తలను పోలీస్ స్టేషన్‌కు రావాలని నోటీస్‌లు ఇస్తున్నారన్నారు. మరి కొన్ని నియోజకవర్గాల్లో వారిని అరెస్ట్ చేస్తున్నారన్నారు. ఈ చర్య ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఇలా అయితే ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్చగా ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. ఇప్పటికే ఇటువంటి ఘటనలపై డీజీపీ, ఆయా జిల్లాల ఎస్పీలకు ఫిర్యాదు కూడా చేశామన్నారు. ఇటువంటి.ఘటనలు జరిగితే ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సీఈసీ, రాష్ట్ర సీఈఓ , డీజీపీ, అన్ని జిల్లాల ఎస్పీలకు ఏపీ ఎలక్షన్ వాచ్ కన్వీనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మెసేజ్ పంపారు.
ఇవి కూడా చదవండి...
Arvind Kejriwal Bail: ఆంజనేయుడి చెంతకు అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీలో తొలి ప్రచారం నేడే
Kodali Nani: ఏందయ్యా నానీ.. ఏంటీ వింత లీలలు!
Read Latest AP News And Telugu News
Updated Date - May 11 , 2024 | 10:58 AM