ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election Results 2024: ఏపీ ఫలితాలకు ముందు ఎన్టీఆర్ భవన్‌లో ఇంట్రెస్టింగ్ సీన్

ABN, Publish Date - Jun 03 , 2024 | 06:05 PM

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు (AP Election Results) మంగళవారం నాడు (జూన్-04న) రాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఒక్కసారిగా ఏపీలో సీన్ మొత్తం మారిపోయింది. ఇక ఎగ్జాక్ట్ ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయా..? అని ఎదురుచూస్తున్న పరిస్థితి..

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు (AP Election Results) మంగళవారం నాడు (జూన్-04న) రాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఒక్కసారిగా ఏపీలో సీన్ మొత్తం మారిపోయింది. ఇక ఎగ్జాక్ట్ ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయా..? అని ఎదురుచూస్తున్న పరిస్థితి. పార్టీల అధినేతలు ఎవరి గెలుపు ధీమాలో వారున్నారు. అమరావతిలో ‘చంద్రబాబు అనే నేను’ అంటూ ప్రమాణ స్వీకారం ఉంటుందని టీడీపీ చెబుతుంటే.. వైజాగ్ వేదికగా ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను’ అని ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ చెప్పుకుంటోంది. ఈ ఇద్దరిలో ప్రమాణం చేసేదెవరన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఏపీ ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


నేరుగా రంగంలోకి బాబు!

టీడీపీ అధినేత నారా చంద్రబాబు అమెరికా నుంచి వచ్చింది మొదలుకుని కౌంటింగ్ రోజు ఎలా ఉండాలి..? కౌంటింగ్ కేంద్రం లోపల ఎలా వ్యవహరించాలి..? అని పార్టీ ముఖ్యనేతలు, ఏజెంట్లతో వరుస సమావేశాలతో బిజిబిజీగా ఉన్నారు. మరోవైపు.. ఫలితాల తర్వాత ఏం చేద్దాం..? అనేదానిపైనా అగ్రనేతలతోనూ చర్చలు జరుపుతున్నారు. ఎన్నికల పోలింగ్ ముగిశాక సోమవారం నాడు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన నేతలు, టీడీపీ శ్రేణులు ఇంట్రెస్టింగ్ సీన్ చూశారు. చంద్రబాబును చూసి ‘జై సీబీఎన్ .. జైజై సీబీఎన్.. సీఎం చంద్రబాబు..’ అంటూ కార్యకర్తలు, అభిమానులు, నేతలు నినాదాలతో హోరెత్తించారు. ఇలా గ్యాప్ లేకుండా నాలుగైదు నిమిషాల పాటు నినాదాలే సరిపోయాయి. ఇక చంద్రబాబు మాట్లాడుతూ.. ‘సంబరాలు రేపు చేసుకుందాం.. ఎనర్జీని వృథా చేసుకోకండి’ అని పార్టీ శ్రేణులతో చమత్కరించారు. ఈ సందర్భంగా కొందరు నేతలు.. ‘కాబోయే సీఎం మీరే సార్’ అంటూ ముందస్తు శుభాకాంక్షలు కూడా చెప్పారు. చూశారుగా.. ఇదే ఎన్టీఆర్ భవన్ వేదికగా నెలకొన్న ఇంట్రెస్టింగ్ సీన్.


అన్నీ కూటమికే ఓటు!

ఇదిలా ఉంటే.. పేరుగాంచిన ప్రాంతీయ, జాతీయ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు కూటమికే ఓటేశాయి. భారీ విజయాన్ని కూటమి దక్కించుకోబోతోందని పదుల సంఖ్యలో సర్వేలు తేల్చి చెప్పాయి. దీంతో టీడీపీలో ఒక్కసారిగా ఎనలేని ఉత్సహం వచ్చేసింది. ఈ దెబ్బతో వైసీపీ శిబిరంలో ఎక్కడా సౌండ్ లేకుండా పోయింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పితే.. కనీసం మీడియాతో మాట్లాడటానికి కూడా ఇతర నేతలు బయటికి రాకపోవడం గమనార్హం. ఫలితాలకు ముందే సీన్ ఏంటనేది వైసీపీకి అర్థమైందనే టాక్ నడుస్తోంది. దీంతో గెలుపు కూటమిదేనని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఎగ్జిట్ ఫలితాలన్నీ అక్షరాలా నిజమవుతాయా..? ఎగ్జాక్ట్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్నది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడక తప్పదు మరి.

Updated Date - Jun 03 , 2024 | 06:14 PM

Advertising
Advertising