ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Janasena: మరో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన పవన్

ABN, Publish Date - Mar 31 , 2024 | 01:26 PM

MLA Candidates: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మరో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించారు. పిఠాపురం ఎన్నికల ప్రచారంలో బిజిబిజీగా ఉన్న సేనాని.. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీచేసే అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. ..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మరో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించారు. పిఠాపురం ఎన్నికల ప్రచారంలో బిజిబిజీగా ఉన్న సేనాని.. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీచేసే అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్‌ను ( Vamsi Krishna Yadav) నియమిస్తూ ఈ మేరకు అధికారిక ప్రకటనలో విడుదల చేశారు. పార్టీ ముఖ్యులతో వివిధ అంశాలపై నిశితంగా చర్చించిన పవన్.. వంశీ పేరును ఖరారు చేశారు. కాగా.. వంశీ కృష్ణ వైసీపీ నుంచి జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. వైసీపీ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపించినప్పటికీ టికెట్ ఇవ్వకుండా అధిష్టానం మోసం చేసిందని.. పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ గుడ్ బై చెప్పేసి బయటికొచ్చేశారు. అనంతరం జనసేన తీర్థం పుచ్చుకోగా.. ఈయన ఫాలోయింగ్, ప్రజల్లో ఉన్న మంచిపేరును, సేవలను గుర్తించిన సేనాని.. వంశీ కోరుకున్న సీటును ఇవ్వడం జరిగింది.

TG Politics: కేసీఆర్ బస్సులో పోలీసుల తనిఖీలు..



రసవత్తరంగానే..!

కాగా.. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ-జనసేన అభ్యర్థి మధ్య పోరు రసవత్తరంగానే జరగనుంది. రెండు సార్లు టీడీపీ తరఫున గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్‌.. సైకిల్ దిగి ఫ్యాన్ గూటికి చేరారు. వైసీపీలో చేరిన తర్వాత ఈయన్నే అభ్యర్థిగా సీఎం వైఎస్ జగన్ రెడ్డి ప్రకటించడం జరిగింది. అయితే.. ఈయనపై గట్టిగానే వ్యతిరేకత సైతం ఉంది. ఇక కూటమిలో భాగంగా ఈ సీటు జనసేనకు దక్కడంతో.. వంశీని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈ ఇద్దరి మధ్య గట్టిగానే పోటీ జరగనుందని చెప్పుకోవచ్చు. అయితే హ్యాట్రిక్ కొడతానని వాసుపల్లి ధీమాగా చెబుతుంటే.. ఎట్టి పరిస్థితుల్లో కూటమి తరఫున వంశీని గెలిపించి తమ సత్తా ఏంటో చూపిస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఫైనల్‌గా విశాఖ దక్షిణ వాసులు ఎవర్ని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారో వేచి చూడాల్సిందే మరి.

జనసేన, పవన్‌కు సంబంధించిన వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 31 , 2024 | 01:44 PM

Advertising
Advertising