మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kodali Nani: ఎన్నికల తర్వాత కొడాలి నాని తీవ్ర ఆవేదన..!

ABN, Publish Date - May 19 , 2024 | 11:37 AM

అవును.. మీరు వింటున్నది నిజమే మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని (Kodali Nani) పోలింగ్ తర్వాత తీవ్ర ఆవేదన చెందుతున్నారట. ఎందుకంటే.. ఎన్నికల్లో (AP Elections) ఓటర్లకు పంచాల్సిన డబ్బులు కొందరు నాని మనుషులు కాజేశారన్నది.. ఇప్పుడు నియోజకవర్గంలో నడుస్తున్న చర్చ. సొంత పార్టీ నేతలే ఇలా చేయడంతో కొడాలి ఆవేదన వ్యక్తం చేస్తున్నారట..

Kodali Nani: ఎన్నికల తర్వాత కొడాలి నాని తీవ్ర ఆవేదన..!

అవును.. మీరు వింటున్నది నిజమే మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని (Kodali Nani) పోలింగ్ తర్వాత తీవ్ర ఆవేదన చెందుతున్నారట. ఎందుకంటే.. ఎన్నికల్లో (AP Elections) ఓటర్లకు పంచాల్సిన డబ్బులు కొందరు నాని మనుషులు కాజేశారన్నది.. ఇప్పుడు నియోజకవర్గంలో నడుస్తున్న చర్చ. సొంత పార్టీ నేతలే ఇలా చేయడంతో కొడాలి ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఈ డబ్బుల వ్యవహారం ఎవరో కాదు.. సొంత పార్టీ నేతలే బయటికి తెచ్చారు. ఓటర్లకు డబ్బులు పంచకుండా కొందరు కాజేశారంటూ గుడివాడ వైసీపీ మైనార్టీ నేత సర్దార్ బేగ్ ఆరోపణలు చేశారు. డబ్బులు కాజేసిన వారిపై పెంపుడు కుక్కలు వదలాలని బేగ్‌ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


ఇంతకీ ఏం జరిగింది..?

మైనార్టీ వార్డుల్లో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పంచాల్సిన.. డబ్బులు కొందరు దోచేశారంటూ సర్దార్‌ సెల్ఫీ వీడియోలో వివరించారు. నాని ఇచ్చిన డబ్బును కొందరు ఓటర్లకు పంచకుండా తమ వద్దే ఉంచుకొని జల్సాలు చేయడానికి, విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని, చిన్ని (కొడాలి నాని తమ్ముడు) ఆ డబ్బులు కాజేసిన వారందరినీ కల్యాణ మండపానికి పిలిపించి నిలదీయాలన్నారు. నిజం చెప్పిన వారిని వదిలేసి డబ్బు వసూలు చేయాలని సూచించారు. ఇవ్వని వారిపైకి పెంపుడు కుక్కలను వదిలేయాలని సూచించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఒక్క కృష్ణా జిల్లాలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.

Updated Date - May 19 , 2024 | 11:39 AM

Advertising
Advertising