AP Politics: వైసీపీ తీర్థం పుచ్చుకున్న కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం
ABN, Publish Date - Mar 15 , 2024 | 12:10 PM
కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువాను కప్పి జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కొడుకు గిరి కూడా వైసీపీలో చేరారు.
తాడేపల్లి: కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌లో (YSRCP) చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ (CM Jagan) సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువాను కప్పి జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కొడుకు గిరి కూడా వైసీపీలో చేరారు. వైసీపీలో ముద్రగడ చేరిక కార్యక్రమంలో ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పీవీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు (తూర్పుగోదావరి జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు), ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇక ముద్రగడ పద్మనాభం పొలిటికల్ కెరియర్ విషయానికి వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పనిచేశారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల్లో మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.
ఇవి కూడా చదవండి
TDP Vs YSRCP: ఆసక్తికరంగా మామా అల్లుళ్ల ఫైట్.. పెదకూరపాడులో టెన్షన్ టెన్షన్
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Mar 15 , 2024 | 12:33 PM