మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu: చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూశారా..?

ABN, Publish Date - Jun 10 , 2024 | 07:57 AM

ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ప్రమాణాస్వీకారం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి...

Chandrababu: చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూశారా..?

అమరావతి/గన్నవరం: ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ప్రమాణాస్వీకారం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. గన్నవరం మండలం కేసరపల్లి మేధా టవర్స్‌ ప్రక్కన జరిగే పనులను టీడీపీ నేతలు, అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జర్మన్‌ హ్యాంగర్స్‌తో భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో స్జేజీని సిద్ధం చేస్తున్నారు. స్టేజీ పనులను తిరుపతి జేసీ ధ్యాన్‌చందర్‌, వైజాగ్‌ వీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ పర్యవేక్షిస్తున్నారు. 800 అడుగుల పొడవు, 420 వెడల్పు గల జర్మన్‌ హ్యాంగర్స్‌తో భారీ టెంట్‌ను వేస్తున్నారు. ఆదివారం టీడీపీ నేత అచ్చెన్నాయుడు, సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌, డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్త, ప్రత్యేకాధికారులు ప్రద్యుమ్న, బాబు.ఎ, వీర పాండ్యన్‌, వ్యవసాయ శాఖ కమీషనర్‌ హరికిరణ్‌, రాష్ట్ర అదనపు డీజీపీ బాబ్జీ, ఐజీలు రాజశేఖర్‌బాబు, అశోక్‌ కుమార్‌, ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి, సీపీ రామకృష్ణ, జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ పరిశీలించారు.


Chandrababu.jpg

అధికారులకు సీఎస్‌ సూచనలు

డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ గన్నవరం మండలం కేసరపల్లి మేధా టవర్స్‌ పక్కన జరుగుతున్న ప్రమాణాస్వీకార ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. సంబంధిత అధికారులకు సీఎస్‌ సూచనలు చేశారు. ప్రధాని మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, శాసన సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు వస్తారని, అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచిం చారు గన్నవరం జాతీయ రహదారి పక్కనే, వెటర్నరీ కళాశాల, సావరగూడెం రోడ్డు ఎలిట్‌ విస్టాస్‌, మేధా టవర్స్‌, ఇతర లే-అవుట్‌లో ఎంపిక చేసిన పార్కింగ్‌ ప్రాంతాలను పరిశీలించారు. ఎలీట్‌ విస్టాస్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, న్యాయ మూర్తులు, తదితర ప్రముఖులకు పార్కింగ్‌ స్థలాన్ని ఎంపిక చేశారు. ప్రధాన మంత్రి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాన సభా వేదిక వద్దకు చేరుకు నేందుకు వీలుగా ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచన చేశారు.

Read more!

Updated Date - Jun 10 , 2024 | 07:57 AM

Advertising
Advertising