AP Elections: సీన్‌లోకి చిరంజీవి.. వార్ వన్‌సైడేనా..!
ABN, Publish Date - May 07 , 2024 | 11:52 AM
ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. గెలుపు కోసం పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటిగా ఉంది. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎన్డీయే కూటమి, మెగా ఫ్యామిలీ కష్టపడుతుంటే.. పవన్‌ను ఓడించే లక్ష్యంతో వైసీపీ వ్యూహలు రచిస్తోంది. ఈక్రమంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అన్నయ్య చిరంజీవి రంగంలోకి దిగారు. తమ్ముడిని గెలిపించాలంటూ ఓ ఎమోషనల్ వీడియోను రిలీజ్ చేశారు.
ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. గెలుపు కోసం పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటిగా ఉంది. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎన్డీయే కూటమి, మెగా ఫ్యామిలీ కష్టపడుతుంటే.. పవన్‌ను ఓడించే లక్ష్యంతో వైసీపీ వ్యూహలు రచిస్తోంది. ఈక్రమంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అన్నయ్య చిరంజీవి రంగంలోకి దిగారు. తమ్ముడిని గెలిపించాలంటూ ఓ ఎమోషనల్ వీడియోను రిలీజ్ చేశారు. దీంతో జనసైనికుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. చిరంజీవి బహిరంగంగా తమ్ముడిని గెలిపించాలంటూ వీడియో రిలీజ్ చేయడంతో మెగాస్టార్ కూటమికి మద్దతు ఇస్తున్నారనే సంకేతాలు వెలువడినట్లైంది. ఇప్పటివరకు బహిరంగంగా ఎవరికి మద్దతు అనేదానిపై చిరంజీవి స్పందించలేదు. తొలిసారి తన తమ్ముడిని గెలిపించాలంటూ పిఠాపురం ఓటర్లను చిరంజీవి కోరారు.
AP Elections: ‘‘నవ సందేహాలు’’ పేరుతో జగన్‌కు షర్మిల మరో లేఖ.. ఈసారి దేనిగురించంటే?
ఎమోషనల్ వీడియో..
తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గొప్పతనాన్ని వివరిస్తూ చిరంజీవి వీడియో రిలీజ్ చేశారు. అమ్మ కడుపులో ఆఖరివాడిగా పుట్టినా.. అందరికీ మంచి చేయాలి.. మేలు జరగాలి అనే విషయంలో ముందువాడిగా పవన్ కళ్యాణ్ ఉంటాడని చిరంజీవి తెలిపారు. తనకంటే జనం గురించి ఎక్కువుగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడి కళ్యాణ్‌బాబుది అంటూ చెప్పారు. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారని.. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టారన్నారు. సరిహద్దుల దగ్గర ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తంలో సాయం చేయడంతో పాటు.. అనేక మందికి ఎందరికో పవన్ కళ్యాణ్ చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుందని వీడియో చిరంజీవి తెలిపారు. ఒక రకంగా చెప్పాంలటే సినిమాల్లోకి బలవంతంగా వచ్చాడని.. రాజకీయాల్లోకి ఇష్టంతో మాత్రమే వచ్చాడన్నారు.
ఎంతోమంది తిట్టినా..
ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుందని, అలాగు ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుందన్నారు. కొడుకు కోసం బాధపడుతున్న తన తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పానని, నీ కొడుకు ఎంతో మంది తల్లులకోసం, వాళ్ల బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధమని తెలిపానన్నారు. ఇది మన బాధకంటే ఎంతో గొప్పది అని తన తల్లికి చెప్పానని చిరంజీవి అన్నారు. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్లతోనే ప్రజాస్వామ్యానికి మరింత నష్టమని.. జనం కోసం జనసైనికుడు అయ్యాడన్నారు. బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన శక్తిశీలి పవన్ అని కీర్తించారు. ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలంటే చట్టసభల్లో ఆయన గొంతు ఉండాలన్నారు. జనమే జయం అని నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు కళ్యాణ్‌ను గెలిపించాలన్నారు. మీకు సేవకుడిగా సైనికుడిగా అండగా నిలబడతాడని, మీకోసం అవసరమైతే కలబడతాడని, మీకల నిజం చేస్తాడని చిరంజీవి తెలిపారు. పిఠాపురం వాసులకు మీ చిరంజీవి విన్నపం అంటూ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి పవన్ కళ్యాణ్ ను గెలిపించాలంటూ వీడియోను ముగించారు.
చిరంజీవి తన తమ్ముడి గెలుపు కోసం వీడియో విడుదల చేయడంతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు మరింత ఈజీ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటిరవకు పవన్ కోసం మెగాస్టార్ మద్దుత ప్రకటిస్తారా లేదా అని ఆలోచించిన జనసైనికులు ప్రస్తుతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ్ముడికి అన్నయ్య మద్దతు లేదంటూ విష ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలంటూ జనసేన నాయకులు సూచిస్తున్నారు.
PM MODI : మాఫియా రాజ్.. కరప్షన్ కింగ్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest AP News And Telugu News
Updated Date - May 07 , 2024 | 12:48 PM