ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pawan Kalyan: అమృత ఘడియల వైపు భారత్.. మోదీపై పవన్ కల్యాణ్ ప్రశంసలు

ABN, Publish Date - May 06 , 2024 | 05:14 PM

ఏపీ సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధి పడకేసిందని వివరించారు. రాజమహేంద్రవరంలో జరిగిన ప్రజాగళం సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సొంత పథకాలుగా సీఎం జగన్ బిల్డప్ ఇచ్చారని విమర్శించారు.

Pawan Kalyan

రాజమహేంద్రవరం: ఏపీ సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధి పడకేసిందని వివరించారు. రాజమహేంద్రవరంలో జరిగిన ప్రజాగళం సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సొంత పథకాలుగా సీఎం జగన్ బిల్డప్ ఇచ్చారని విమర్శించారు. వాటికి జగనన్న కాలనీలు అని పేరు పెట్టుకున్నారని విమర్శించారు. జగన్ హయాంలో కుంభకోణాలకు లెక్కే లేదని తెలిపారు. మోదీ వికసిత్ భారత్ కలలో తాము కూడా భాగస్వాములు అవుతామని స్పష్టం చేశారు.


‘దేశానికి అభివృద్దితోపాటు గుండె ధైర్యం అవసరం అని, శత్రువుల నుంచి దేశాన్ని కాపాడే గుండె ధైర్యం కావాలని పవన్ కల్యాణ్ అభిప్రాయ పడ్డారు. మోదీ లాంటి నేత కేంద్రంలో ఉండటంతో గత పదేళ్లుగా భారత్ వైపు చూడాలంటే మిగతా దేశాలు భయపడుతున్నాయని వివరించారు. మోదీ గొంతెత్తితే దేశంలోని అణువణువూ స్పందిస్తోంది’ అని స్పష్టం చేశారు.


‘హిమాలయ పర్వతాలంత ఎత్తైన జాతీయత మాకు ఉంది.. మోదీ ముందుండి ఏపీని నడిపించాలని కోరారు. గతంలో పద్మ అవార్డులు రాజకీయాలు చేసే వారికి మాత్రమే వచ్చేవని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మోదీ హయాంలో అర్హులకు పద్మ అవార్డులు దక్కుతున్నాయని పేర్కొన్నారు. 135 పద్మశ్రీ అవార్డులు దక్షిణ భారతీయులకు ఇచ్చిన ఘనత మోదీకి దక్కుతుందని పేర్కొన్నారు. భారత్ శక్తిని ప్రపంచానికి చాటిన మహానుభావుడు మోదీ అని స్పష్టం చేశారు. విష ఘడియలు నుంచి అమృత ఘడియలు వైపు మోదీ తీసుకువెళ్ళాలని.. మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కాబోతున్నారు అని’ స్పష్టం చేశారు.


‘జగన్ ఐదు కోట్ల మందిని హింసింస్తున్నాడని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. జగన్ అవినీతి పాలన అంతమొందించేందుకు మోదీతో కలిసి పనిచేస్తున్నాం అని వివరించారు. అయోధ్యకు శ్రీరామచంద్రుడిని తీసుకొచ్చిన మహానుభావుడు మోదీ అని’ పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు.


Read Latest AP News And Telugu news

Updated Date - May 06 , 2024 | 05:14 PM

Advertising
Advertising