AP Election 2024: ధర్మం వైపు నిలబడండి.. వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, Publish Date - Apr 08 , 2024 | 11:52 AM
కడప ఎంపీ స్థానం నుంచి తమ్ముడు వైఎస్ అవినాశ్ రెడ్డిపై పోటీ చేసి అన్న, ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు సవాలు విసురుతున్న వైఎస్ షర్మిల మరోసారి వైసీపీ రాజకీయాలపై ధ్వజమెత్తారు. ఎక్కడ చూసినా అక్రమాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. ‘‘ అందుకే మీ రాజన్న బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తోంది. ధర్మం వైపు నిలబడండి.. ఆశీర్వదించండి.. గెలిపించండి’’ కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.

ఏపీ 'న్యాయ యాత్ర'లో భాగంగా ఆదివారం కమలాపురం నియోజకవర్గంలో పర్యటించానని ఆమె అన్నారు. దారిపొడవునా స్వాగతం పలికి మద్దతు తెలిపిన అశేష ప్రజానీకానికి కృతజ్ఞతలు చెబుతున్నానని ఆమె అన్నారు. ‘‘ దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి మన కడప నగరానికి ఎంతో సేవ చేశారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఆయన కల. కడప స్టీల్ పూర్తయితే 25 వేల మందికి ఉద్యోగాలు వచ్చేవి. ఆయన వారసుడు అని చెప్పుకునే జగన్ అభివృద్ధి మరిచి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ నిందితులకే టికెట్లు ఇస్తున్నారు’’ అని షర్మిల ధ్వజమెత్తారు. కమలాపురం నియోజకవర్గంలో పర్యటనకు సంబంధించిన ఫొటోలను ఈ సందర్భంగా ఆమె షేర్ చేశారు.
Updated Date - Apr 08 , 2024 | 11:55 AM