ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: రాజకీయాల్లోకి స్టార్ యాంకర్..! జనసేన, వైసీపీ తరపున ప్రచారం..

ABN, Publish Date - Mar 28 , 2024 | 11:40 AM

ఒక యాంకర్.. రెండు పార్టీల తరపున ప్రచారం.. అదేమిటి రెండు పార్టీలు కూటమి కట్టాయనుకుంటున్నారా.. అయితే మీరు పప్పులో కాలేసినట్లే.. ఆ రెండు పార్టీలు ప్రత్యర్థి పార్టీలు.. ఒకరంటే మరొకరికి అసలు పడదు. అలాంటిది ఒక మనిషి రెండు పార్టీల తరపున ప్రచారం చేయడం ఏమిటనుకుంటు న్నారా.. మీరు చదువుతున్నది నిజమే..

ఒక యాంకర్.. రెండు పార్టీల తరపున ప్రచారం.. అదేమిటి రెండు పార్టీలు కూటమి కట్టాయనుకుంటున్నారా.. అయితే మీరు పప్పులో కాలేసినట్లే.. ఆ రెండు పార్టీలు ప్రత్యర్థి పార్టీలు.. ఒకరంటే మరొకరికి అసలు పడదు. అలాంటిది ఒక మనిషి రెండు పార్టీల తరపున ప్రచారం చేయడం ఏమిటనుకుంటు న్నారా.. మీరు చదువుతున్నది నిజమే... జబర్దస్ ద్వారా అందరికీ సుపరచితురాలై.. స్టార్ యాంకర్‌గా పేరు తెచ్చుకుని.. బుల్లి తెరపై నటిగా బిజీగా ఉన్న అనసూయ భరద్వాజ్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

AP Elections: ఓటమి భయంతో అబద్ధాలు.. అడ్డంగా దొరికిపోయిన జగన్..!

రాజకీయాలపై అనసూయ..

తనకు రాజకీయాలంటే ఇష్టం లేదని.. కాని సమాజంలో ఉన్నాం కాబట్టి రాజకీయ, సామాజిక అంశాలపై స్పందించాలంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. అనసూయ నిజంగా వైసీపీ, జనసేన తరపున ప్రచారం చేస్తారా అనే చర్చ మొదలైంది. జబర్దస్‌లో అనసూయ యాంకర్ కాగా..నాగబాబు, రోజ జడ్జిలుగా ఉండేవారు. దీంతో వారిద్దరితో అనసూయకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పుకోవచ్చు. దీంతో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమెను రాజకీయాల గురించి ప్రశ్నించగా.. తనకు అంత ఆసక్తి లేదని, నాన్న తన వల్ల రాజకీయాలను వదిలేశారని చెప్పారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి రానని, అయితే ఎన్నికల్లో ప్రచారం చేస్తానని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ తనకు నచ్చిన నాయకుడని ఆయన పిలిస్తే జనసేన తరపున ప్రచారం చేస్తానని చెప్పుకొచ్చారు. మరోవైపు నాగబాబు, రోజాల్లో ఎవరంటే ఇష్టమని అడగ్గా.. తనకు ఇద్దరూ సమానమేనని తెలిపారు. పార్టీలకు అతీతంగా రోజా పిలస్తే ఆమె తరపున ప్రచారం చేస్తానని అనసూయ తెలిపారు. అప్పటి నుంచి అనసూయ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా అనే చర్చ జరుగుతోంది.

సెలబ్రెటీల ప్రచారం

ఎన్నికలంటే సెలబ్రెటీలతో ప్రచారం చేయించుకోవడం చూస్తుంటాం. సెలబ్రేటీలు వెళ్తే జనం రావడంతో పాటు.. ఆ ప్రాంతంలో పోటీ చేసే అభ్యర్థికి ఎక్కువ ప్రచారం లభిస్తుంది. దీంతో సెలబ్రెటీలను ప్రచారాలకు పిలవడం ఓ ట్రెండ్‌గా వస్తోంది. మరోవైపు కొన్ని చోట్ల అయితే సినీ, క్రీడా రంగానికి చెందిన సెలబ్రేటీలు నేరుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావుడి నెలకొన్న నేపథ్యంలో అనసూయ భరద్వాజ్ వ్యాఖ్యలు ట్రెండ్ అవుతున్నాయి.

జనసేనకు ప్రచారం..?

సాధారణంగా నాగబాబు ఎన్నికల్లో పోటీ చేస్తే అనసూయ ప్రచారానికి వెళ్లేవారు. ఇప్పుడు నాగబాబు పోటీ చేయడం లేదు. పవన్ కళ్యాణ్ పిలిస్తే ప్రచారం చేస్తానని చెప్పారు. పార్టీలో సభ్యురాలు కూడా కాదు. దీంతో నేరుగా పవన్ లేదా నాగబాబు జోక్యం చేసుకుని పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయాలని అనసూయను అడుగుతారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు జనసేనకు ప్రచారం చేస్తానన్న అనసూయను, రోజా తన కోసం ప్రచారం చేయాలని పిలిచే అవకాశాలు తక్కువే. జస్ట్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చే క్రమంలో ఎన్నికల ప్రచారంపై అనసూయ స్పందించి ఉంటారని, ఆమె ప్రచారం చేసే అవకాశాలు తక్కువే అని.. సినీ, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

AP Politics: నరకాసుర పాలనకు చెక్ పెట్టే సమయం వచ్చింది.. జగన్‌పై చంద్రబాబు ఫైర్

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 28 , 2024 | 12:10 PM

Advertising
Advertising