TDP: పెన్షన్ల అంశం.. సీఎస్‌తో టీడీపీ నేతల బృందం భేటీ
ABN, Publish Date - Apr 01 , 2024 | 02:04 PM
Andhrapradesh: రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీలో జాప్యంపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పెన్షన్ల పంపిణీకి దాదాపు పది రోజుల సమయం పడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న టీడీపీ.. ఈ అంశాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లింది. సోమవారం సీఎస్ జవహర్ రెడ్డితో టీడీపీ నేతల బృందం భేటీ అయ్యింది. పెన్షన్లు పంపిణీ విషయంలో వైసీపీ కావాలనే జాప్యం చేసేలా వ్యవహరిస్తోందని టీడీపీ ఆరోపించింది.
అమరావతి, ఏప్రిల్ 1: రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీలో జాప్యంపై టీడీపీ (TDP) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పెన్షన్ల పంపిణీకి దాదాపు పది రోజుల సమయం పడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న టీడీపీ.. ఈ అంశాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లింది. సోమవారం సీఎస్ జవహర్ రెడ్డితో టీడీపీ నేతల బృందం భేటీ అయ్యింది. పెన్షన్లు పంపిణీ విషయంలో వైసీపీ కావాలనే జాప్యం చేసేలా వ్యవహరిస్తోందని టీడీపీ ఆరోపించింది. ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసేలా ఆదేశాలివ్వాలని సీఎస్ జవహర్ రెడ్డిని (CS Jawaha Reddy) టీడీపీ నేతల బృందం కోరింది.
Puzzle: 99 శాతం మంది ఫెయిల్ అయ్యారు!.. ఈ ఫొటోలోని పాముని 7 సెకెన్లలో కనిపెట్టండి..!
అనంతరం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ... ఎన్నినల్లో వైపీపీ ఓడిపోతుందనే విషయం జగన్‌కు (CM Jagan) తెలుసని.. చివరి అవకాశంగా జగన్ టీడీపీపై కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. వలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయమంటే చంద్రబాబుకేం సంబంధమని ప్రశ్నించారు. పెన్షన్లు చంద్రబాబు ఎలా బాధ్యుడు అవుతారని నిలదీశారు. ఒక్క అవ్వా తాతకు కూడా పెన్షన్ దక్కాల్సిందే అని స్పష్టం చేశారు. ఈసీ ఉత్తర్వులను తూచా తప్పకుండా పాటించాలని డిమాండ్ చేశారు. అందరికీ పెన్షన్లు అందేలా చూడాలని సీఎస్ జవహర్ రెడ్డిని కోరామన్నారు. పెన్షన్ నిధులు ఖజానాలో ఉన్నాయా..? లేవా అని సీఎస్ జవహర్ రెడ్డిని అడిగామన్నారు. అవసరమైన నిధులు ఉన్నాయని సీఎస్ చెప్పారన్నారు. ఇంటికే వచ్చి పెన్షన్లు ఇచ్చేలా చూడాలని సీఎస్ జవహర్ రెడ్డిని కోరామన్నారు. తాము అధికారంలోకి రాగానే రూ. 4 వేల పెన్షన్ ఇంటికే ఇస్తామని వర్ల రామయ్య హామీ ఇచ్చారు.
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. పెన్షన్లు రాకపోవడానికి కారణం చంద్రబాబేనని జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సెక్రటేరీయేట్ వ్యవస్థ ద్వారా రెండు గంటల్లో పెన్షన్ పంపిణీ చేయొచ్చన్నారు. పెన్షన్లు సరిగా అందనీయొద్దని జగన్ అధికారుల మీద ఒత్తిడి తెస్తున్నారన్నారు. పెన్షన్ల పంపిణీ చేసే విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని కోరామన్నారు. ఈసీ నిబంధనలకు విరుద్దంగా సెర్ప్ సీఈవో సర్క్యులర్ ఉందనే విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లామని నక్కా ఆనందబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Big Breaking: కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల.. అధికారిక నిర్ణయం వచ్చేసింది!
Arvind Kejriwal: కేజ్రీవాల్ కస్టడీ మళ్లీ పొడిగింపు.. ఇప్పట్లో బయటకు కష్టమేనా?
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Apr 01 , 2024 | 03:10 PM