ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: బెయిల్ ఇచ్చినా పిన్నెల్లి బయటికి రాలేదేం..?

ABN, Publish Date - May 25 , 2024 | 12:34 PM

వైసీపీ నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంకా అజ్ఞాతంలోనే కొనసాగుతున్నారు. ఈవీఎంల ధ్వంసం కేసులో జూన్6 వరకు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించినప్పటికీ ఎమ్మెల్యే పిన్నెల్లి మాత్రం ఇంకా బయటకురాలేదు. ఓవైపు రామకృష్ణారెడ్డి తప్పించుకుతిరుగుతుంటే.. మరోవైపు ఆయన అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.

PINNELLI RAMAKRISHNA REDDY

వైసీపీ నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ఇంకా అజ్ఞాతంలోనే కొనసాగుతున్నారు. ఈవీఎంల ధ్వంసం కేసులో జూన్6 వరకు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించినప్పటికీ ఎమ్మెల్యే పిన్నెల్లి మాత్రం ఇంకా బయటకురాలేదు. ఓవైపు రామకృష్ణారెడ్డి తప్పించుకుతిరుగుతుంటే.. మరోవైపు ఆయన అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. తాజాగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై రెంటచింతల పోలీస్‌స్టేషన్‌లో హత్యామత్నం కేసు నమోదైంది. ముందే విషయం తెలుసుకున్న పిన్నెల్లి అజ్ఞాతంలోనే ఉండిపోయారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఓవైపు తాను పారిపోలేదంటూ ప్రగల్భాలు పలికిన పిన్నెల్లి ప్రస్తుతం ఎక్కడ దాక్కున్నారనేది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.


హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినా పిన్నెల్లి బయటకు రాకపోవడంపై ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. ఎన్నికల సమయంలో అతడి అరాచకాలు బయటకు వస్తుండటంతోనే భయపడి ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐపీసీ 307 కింద పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు నమోదుకావడంతో.. ఈకేసులు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న అనుమానంతోనే ఆయన బయటకు రాకపోయిఉండొచ్చనే చర్చ నడుస్తోంది. పాల్వాయి గేట్ గ్రామంలోని పోలింగ్ బూత్‌లో టీడీపీ ఏజెంట్‌గా ఉన్న నంబూరు శేషగిరిరావుపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు దాడిచేసిన ఘటనపై రెంటచింతట పోలీసులు హత్యాయత్నం కేసు నమోదుచేశారు. పిన్నెల్లి ప్రోద్బలంతోనే తనపై చంపేందుకు ప్రయత్నించారని శేషగిరిరావు పోలీసులకు 161 స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో కోర్ట్‌లో మెమో ఫైల్ చేసి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

మళ్లీ రెచ్చిపోయిన వైసీపీ మూక.. పెట్రలో పోసి, నిప్పంటించి..


ఉన్నారా.. పారిపోయారా..

పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ముందస్తు బెయిల్ ఇస్తూ హైకోర్టు పలు ఆంక్షలు విధించింది. మాచర్ల వెళ్లొద్దని, నరసరావుపేటలోనే ఉండాలని ఆదేశించింది. కోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోనే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం వరకు నరసరావుపేటలో ఆయన కనిపించలేదు. హత్యాయత్నం కేసు పెడుతున్నారని ముందే తెలుసుకుని పరారయ్యారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దేశంలోనే ఉన్నారా.. విదేశాలకు వెళ్లిపోయారా అని పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.


MLA Pinnelli: పిన్నెల్లి వ్యవహారంపై పీవీ రమేష్ వ్యంగ్యస్త్రాలు.. గట్టిగానే..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - May 25 , 2024 | 01:56 PM

Advertising
Advertising