YSRCP: దువ్వాడకు ఇంటిపోరు ఎందుకు.. సతీమణి రివర్స్ కావడం వెనుక..!?
ABN, Publish Date - Apr 19 , 2024 | 01:49 PM
శ్రీకాకుళం జిల్లాలో కీలక నియోజకవర్గమైన టెక్కలిలో వైసీపీ (YSR Congress) అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌కు (Duvvada Sreenivas) ఇంటిపోరు మొదలైంది. తాను ఈనెల 22న నామినేషన్ వేస్తానని ఆయన సతీమణి, టెక్కలి జడ్పీటీసీ వాణి శుక్రవారం ప్రకటించడంతో అధికారపార్టీలో కలకలం మొదలైంది..
శ్రీకాకుళం జిల్లాలో కీలక నియోజకవర్గమైన టెక్కలిలో వైసీపీ (YSR Congress) అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌కు (Duvvada Sreenivas) ఇంటిపోరు మొదలైంది. తాను ఈనెల 22న నామినేషన్ వేస్తానని ఆయన సతీమణి, టెక్కలి జడ్పీటీసీ వాణి శుక్రవారం ప్రకటించడంతో అధికారపార్టీలో కలకలం మొదలైంది. గతేడాది ఏప్రిల్ 19న మూలపేట పోర్టు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి (YS Jagan Mohan Reddy).. సభలో ప్రసంగం అనంతరం నియోజకవర్గ అభ్యర్థిగా దువ్వాడ శ్రీను పేరును ప్రకటించారు. ప్రజ లందరూ ఆశీర్వదించాలంటూ కోరారు. కొద్దిరోజుల తర్వాత దువ్వాడ శ్రీను సతీమణి వాణి నేరుగా సీఎం వద్దకు వెళ్లి.. తన దగ్గరున్న ఆధారాలు.. ఇతరత్రా కీలక విషయాలను వెల్లడించి నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో టెక్కలి వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా దువ్వాడ వాణిని జగన్ నియమించారు. ఆతర్వాత కొన్నాళ్లకు మళ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిని మార్పుచేసి దువ్వాడ శ్రీనును టెక్కలి వైసీపీ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించేశారు. ఈ నిర్ణయంపై అప్పట్లో వాణి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పోటీ చేస్తానని ప్రకటన
సార్వత్రిక ఎన్నికలకు తాను కూడా టెక్కలి నుంచి పోటీలో దిగుతున్నట్లు.. ఈనెల 22న నామినేషన్ వేస్తున్నట్లు దువ్వాడ వాణి గురువారం ప్రకటించారు. దీంతో ఈ విషయం సంచలనమైంది. ఇంటిపోరుతోనే.. పోటీకి సై అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్న తన సతీమణి వాణిని ఎలా ఎదుర్కొంటారోనని చర్చ మొదలైంది. ఒకవేళ పోటీలో ఉంటే తన పరువు.. పార్టీ పరువేమవ్వాలన్నది సంశయమే.
టీడీపీలోకి భారీగా చేరికలు
ఇప్పటికే నియోజకవర్గంలో అత్యంత బలంగా టీడీపీలోకి చేరికలు పెరిగిపోయాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఇంటి కి వెళ్లిమరీ వైసీపీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకుంటు న్నారు. దీంతో అక్కడ వైసీపీ ఏరీతిన ఉందన్నదీ ప్రజలందరికీ అర్థమవుతోంది.
Updated Date - Apr 19 , 2024 | 02:12 PM