AP Politics: ‘ముందు వీటికి సమాధానం చెప్పు’.. జగన్‌ను లెఫ్ట్ అండ్ రైట్ వాయించిన షర్మిల..
ABN, Publish Date - May 10 , 2024 | 07:24 PM
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) అస్సలు తగ్గడం లేదు. ఛాన్స్ దొరికితే చాలు ముఖ్యమంత్రి జగన్‌పై(CM YS Jagan) విరుచుకుపడుతున్నారు. తాజాగా కడప పార్లమెంట్ సెగ్మెంట్(Kadapa Parliament Seat) పరిధిలో ప్రచారం నిర్వహించిన వైఎస్ షర్మిల.. మరోసారి జగన్‌పై ఫైర్ అయ్యారు. తనపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలకు లెఫ్ట్ అండ్ రైట్ కౌంటర్..
కడప, మే 10: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) అస్సలు తగ్గడం లేదు. ఛాన్స్ దొరికితే చాలు ముఖ్యమంత్రి జగన్‌పై(CM YS Jagan) విరుచుకుపడుతున్నారు. తాజాగా కడప పార్లమెంట్ సెగ్మెంట్(Kadapa Parliament Seat) పరిధిలో ప్రచారం నిర్వహించిన వైఎస్ షర్మిల.. మరోసారి జగన్‌పై ఫైర్ అయ్యారు. తనపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలకు లెఫ్ట్ అండ్ రైట్ కౌంటర్ ఇచ్చిపడేస్తున్నారు. ఓ బహిరంగ సభలో మాట్లాడిన ఆమె.. తనకు రాజకీయ కాంక్ష ఉందని జగన్ అనటాన్ని ప్రస్తావిస్తూ ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. తాను సూటిగా కొన్ని ప్రశ్నలు వేస్తానని.. వాటిని జగన్ సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.
వైఎస్ షర్మిల కామెంట్స్ యధావిధిగా..
👉 వైఎస్ఆర్ బిడ్డను రాజకీయాలకు తీసుకు వచ్చింది ఎవరు ?
👉 జగన్ జైల్లో ఉంటే.. 19 స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తె ప్రచారం చేయాలని అడిగింది నువ్వు కాదా ?
👉 చంద్రబాబు గ్రాఫ్ పెరుగుతుంది అని పాదయాత్ర చేయమని చెప్పింది నువ్వు కాదా ?
👉 సమైక్యాంధ్ర ఉద్యమానికి నన్ను రాజకీయంగా వాడుకున్నది నువ్వు కాదా ?
👉 నాకు రాజకీయ కాంక్ష ఉంటే..నేను పాదయాత్ర చేసినప్పుడు మీరు జైల్లో అన్నారు
👉 మొత్తం పార్టీ నా చుట్టూ ఉంది
👉 ఎప్పుడు నాకు రాజకీయ కాంక్ష ఉంటే నేను పార్టీని హైజాక్ చేయలేనా ?
👉 జగన్ ఆన్న వస్తాడు అని కాలికి బలపం కట్టుకొని తిరిగింది నేను కాదా ?
👉 నా కాలు విరిగినా వెంటనే కోలుకొని మళ్ళీ పాదయాత్ర చేయలేదా ?
👉 నేను పొందాలి అనుకున్న పోస్ట్ నేను పొందే దాన్ని
👉 నన్ను ఎంపీ చేయాలని మీ పార్టీలో కూడా చాలా మంది అడిగారు
👉 నాకు రాజకీయ కాంక్ష గాని,డబ్బు కాంక్ష గాని ఉందని ఎలా అంటారు ?
👉 నిన్ను ముఖ్యమంత్రిని చేసే వరకు నేను చేసింది త్యాగం
👉 మీరు సీఎం అవ్వాలని నా ఆన్న కోసం త్యాగం చేశా
👉 వైఎస్ఆర్ సంక్షేమ పాలన తీసుకు వస్తారు అని నేను త్యాగం చేసిన మాట వాస్తవం కాదా ?
👉 మన ఇద్దరం బైబిల్ మీద ప్రమాణం చేద్దాం
👉 నీకోసం నేను త్యాగం చేశాను అని బైబిల్ మీద ప్రమాణం చేస్తా .
👉 నేను డబ్బు అడిగాను అని ..పోస్ట్ అడిగాను అని మీరు ప్రమాణం చేయగలరా ?
👉 నేను అడిగినట్లు ఆధారాలు రుజువు చేయగలరా ?
👉 మనిషిని మనిషిగా గుర్తించడం మీకు వైఎస్ఆర్ నుంచి ఎందుకు రాలేదు ?
👉 వైఎస్ఆర్ హృదయంలో హృదయంగా పెరిగిన
👉 వైఎస్ఆర్ ఆశయాలు కొనసాగాలని కోరుకున్న
👉 మీకోసం నేను నా జీవితాన్ని త్యాగం చేశా
👉 నీకోసం నేను నిలబడ్డా
👉 రాజకీయాల కోసం నన్ను నెపోటిజం అంటారా ?
👉 రాజారెడ్డి, జయమ్మ, సౌభ్యగ్యమ్మ, వివేకా అందరూ రాజకీయాల్లో ఉన్నారు
👉 అందరూ ఒకే జనరేషన్ కి చెందిన వాళ్ళు
👉 అప్పుడు లేదా నెపోటిజం ?
👉 ఇప్పుడు మీరు రాజకీయాల్లో ఓకే జనరేషన్ వాళ్ళు ఉండొద్దు అంటారు
👉 ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి ,తమ్ముడు అని నెత్తిన పెట్టుకొని తిరిగే అవినాష్ రెడ్డి,భారతి అందరూ ఉన్నారు కదా
👉 వీళ్ళను నెపోటీజం అనరా ?
👉 నీ చెల్లెలు అంటే నీకు అభద్రతా భావం ఉంది
👉 నీ చెల్లెలు అంటే నీకు భయం ఉంది
👉 ఏ రోజు వైఎస్ఆర్ బిడ్డ పైసా పని అడగలేదు
👉 పైసా సహాయం అడగలేదు
👉 నాన్న సీఎంగా ఉన్నప్పుడు కూడా పదవిని చూశా
👉 నాకు డబ్బు ఆశ ఉంటే అప్పుడే ఎంతో చేసుకొనే దాన్ని
👉 నేనైనా, నా భర్త అయినా ఈ రోజు వరకు పైసా సహాయం అడగలేదు
👉 మేము అడిగినట్లు దమ్ముంటే నిరూపణ చేయగలరా ?
👉 మీరు వైఎస్ఆర్ కొడుకు అని ఎందుకు మరిచి పోతున్నారు
👉 వైఎస్ఆర్ కొడుకుగా మీ వ్యవహారం లేదు
👉 జగన్ చాలా లిమిటెడ్ గా ఆలోచన చేస్తున్నారు
👉 రాజకీయ ఆకాంక్ష ఉన్న వాళ్ళు ఓకే పార్టీలోనో...లేక ఇతర పార్టీలోనో ఎంతో మంది ఉన్నారు
👉 ఓకే కుటుంబంలో పోలీసు ఉంటాడు..లాయర్ ఉంటాడు.
👉 రాజకీయ పార్టీలు అన్నది ఐడియాలజి బెస్ ఉన్నవి.
👉 ఎవరు ఎక్కడ పని చేయాలి అన్నది ఆ మనిషికి హక్కు ఉంటుంది
👉 రాజకీయంగా వ్యతిరేకించినందుకు నాపై తప్పుడు ప్రచారం చేయించారు
👉 తప్పుడు ప్రచారం చేయించినందుకు మీరు చరిత్రలో నిలిచి పోతారు
👉 పెయిడ్ ఆర్టిస్ట్ లకు కుక్క బిస్కెట్లు వేసి మరి నిందలు వేశారు
👉 జగన్ కి చంద్రబాబు పిచ్చి పట్టింది
👉 ఆయన చంద్రబాబు అనే భ్రమ లో బ్రతుకుతున్నారు
👉 ఆయనవి అన్ని ఊహ జనితమైన ఆరోపణలు
👉 మేము చంద్రబాబు చేతిలో కీలు బొమ్మ అనడంలో అర్థం లేదు
👉 ఈయనకు అందరూ కీలు బొమ్మలు లా కనిపిస్తారు
👉 రేవంత్ కీలు బొమ్మ, మోడీ కీలు బొమ్మ, సునీత కీలు బొమ్మ.. నేను కీలు బొమ్మ
👉 మీకు ఏ విలువలు ఉన్నాయి సమాధానం చెప్పాలి ?
👉 YSR మరణంలో రిలయన్స్ హస్తం ఉందని చెప్పింది ఈ జగన్ కాదా ?
👉 వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయించ లేదా ?
👉 అధికారంలో వచ్చాక వాళ్లకు ఎంపీ పదవులు ఇచ్చారు
👉 ఇదేనా నీకున్న విలువ ?
👉 మీకు ఎలా వీలు అయితే అలా మాట్లాడతారా?
👉 వివేకా హత్య విషయంలో సీబీఐ విచారణ అడిగారు
👉 ముఖ్యమంత్రి అయ్యాక.. విచారణ వద్దు అన్నారు
👉 ఇదేనా మీకున్న విలువ. అవసరానికి మాట మారుస్తారా ?
👉 కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పేరును ఛార్జ్ షీట్ లో చేర్పించలేదు
👉 మీరే ఒక మనిషి పెట్టీ కోర్టుల్లో కేసులు వేపించారు
👉 పొన్నవోలు సుధాకర్ రెడ్డి తో పిటీషన్ వేయించింది మీరు కాదా?
👉 ఆయనకు మీరు అడ్వకేట్ జనరల్ పదవి ఇవ్వలేదా ?
👉 మీకు విలువ అనేది ఉంటే.. వైఎస్ఆర్ పేరును ఛార్జ్ షీట్ లో పేరు పెట్టించిన వాళ్లకు ఎలా పదవులు ఇస్తారు ?
👉 సాక్షిలో పైన వైఎస్ఆర్ ఫోటో.. కింద వివేకా మీద తప్పుడు ప్రచారం.. ఇదేనా మీ విలువ
👉 కడపకు వచ్చి ఒక్క మంచి మాట చెప్పలేదు
👉 వివేకా వ్యక్తి గత జీవితం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు
👉 సొంత బాబాయి మీద తప్పుడు ప్రచారం చేస్తారు
👉 ఇదేనా మీకు ఆన్న విశ్వసనీయత?
👉 మీకు విలువ ఉంటే అవినాష్ రెడ్డి మీద అనుమానం ఎందుకు రాలేదు ?
👉 సాక్షిలో మీరు హార్ట్ ఎటాక్ అని ఎందుకు వార్త నడిపారు
👉 అవినాష్ రెడ్డి అబ్బాయి అంట...4 ఇంటర్వ్యూ లు ఇచ్చాడట
👉 ఆ నాలుగు ఇంటర్వ్యూ లు చూసి అవినాష్ రెడ్డి నిర్దోషి అని కన్విన్స్ అయ్యాడట
👉 కన్విన్స్ అవ్వడానికి నువ్వు ఎవరు ?
👉 నువ్వు ఏమైనా రాజ్యంగమా లా నా ?
👉 కన్విన్స్ అవ్వాల్సింది న్యాయ వ్యవస్థ
👉 సీబీఐ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి
👉 అన్ని తెలిసి కూడా కన్విన్స్ అయ్యాడని బుకాయిస్తున్నాడు
👉 మీకు విశ్వసనీయత ఉంటే.. హోదా ఎందుకు రాలేదు ?
👉 విశ్వసనీయత ఉంటే..పోలవరం ఎందుకు కట్టలేదు ?
👉 కడప స్టీల్ ఎందుకు కట్టలేదు ?
👉 కడపలో 620 గ్రామాలకు కనీసం త్రాగునీరు లేదు
👉 వైఎస్ఆర్ తర్వాత ఒక్క ఎకరాకు సాగు నీరు ఇవ్వలేదు
👉 నిర్దోషులు అయితే సీబీఐ కి ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారు ?
👉 దొంగ ఎప్పుడైనా దొంగ అని చెప్తాడా ?
👉 దొంగ మాటలు పిచ్చోళ్లు నమ్ముతారు
👉 అంటే ఇక్కడ జగన్ పిచ్చోడు కదా ?
👉 రేపు రాహుల్ వస్తున్నారు
👉 ఇడుపుల పాయ వద్ద నివాళులు అర్పిస్తారు
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - May 10 , 2024 | 07:24 PM