ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Simhadri Appanna: సింహాద్రి అప్పన్న దేవాలయంలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం

ABN, Publish Date - May 18 , 2024 | 01:03 PM

సింహాచలం అప్పన్న దేవాలయంలో ఎలక్ట్రిక్ బస్సులను ఆలయ చైర్మన్ అశోక్ గజపతిరాజు, ఈవో శ్రీనివాసమూర్తి ప్రారంభించారు. ఒక్కో బస్సు ఖరీదు రూ.కోటి 65 లక్షలు అని తెలుస్తోంది. ఎలక్ట్రిక్ బస్సులు కావడంతో ఒక్కో బస్సును రెండున్నర గంటల పాటు చార్జింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేస్తుంది.

విశాఖ: సింహాచలం అప్పన్న దేవాలయంలో ఎలక్ట్రిక్ బస్సులను ఆలయ చైర్మన్ అశోక్ గజపతిరాజు, ఈవో శ్రీనివాసమూర్తి ప్రారంభించారు. ఒక్కో బస్సు ఖరీదు రూ.కోటి 65 లక్షలు అని తెలుస్తోంది. ఎలక్ట్రిక్ బస్సులు కావడంతో ఒక్కో బస్సును రెండున్నర గంటల పాటు చార్జింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేస్తుంది. ఈ సందర్భంగా అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ.. భక్తుల సౌకర్యార్ధం ప్రకృతి వనరులను కాపాడుకునేందుకు.. కాలుష్యాన్ని తగ్గించేందుకు కరెంట్‌‌తో నడిచే వాహనాలు అవసరమన్నారు.

Big Alert: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. మెట్రో రైలు వేళలు


దీనికోసం రెండు బస్సులను కొనుగోలు చేసి భక్తులకు అందించామని అశోక్ గజపతి రాజు తెలిపారు. ప్రస్తుతం బస్సు టికెట్ పెంచే యోచన లేదన్నారు. గతంలో సాధారణ బస్సు టికెట్ రేటు 15 రూపాయలు ఉంటే.. అదే టికెట్ రేటుతో ఏసీలో భక్తులను సింహగిరికి చేరుస్తామన్నారు. ఈ బస్సు సాధ్యాసాధ్యాలను పరిశీలించి, పొల్యూషన్ లేని మరిన్ని వాహనాలను కొనుగోలు చేస్తామని చైర్మన్ అశోక్ గజపతి రాజు వెల్లడించారు.

ఇదికూడా చదవండి: Hyderabad: ‘మెట్రో’లో మహిళలు తగ్గుతున్నారు..!

Read Latest AP News and Telugu News

Updated Date - May 18 , 2024 | 01:03 PM

Advertising
Advertising