TDP: టీడీపీలో చేరిన మేయర్ దంపతులు
ABN, Publish Date - Aug 27 , 2024 | 05:10 PM
గత ఎన్నికల్లో వైసీపీని ప్రజలు తిరస్కరించారని మంత్రి నారా లోకేశ్ గుర్తుచేశారు. అయినప్పటికీ ఆ పార్టీకి గుణపాఠం రాలేదని, బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ కాలం వెళ్లదీస్తోందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విపక్ష వైసీపీకి వరసగా షాకులు తగులుతున్నాయి. ఒక్కో ముఖ్య నేత పార్టీని వీడుతున్నారు. ఏలూరు మేయర్ దంపతులు వైసీపీని వీడారు. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మేయర్ షేక్ నూర్జహాన్ దంపతులకు లోకేశ్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మేయర్ దంపతులతోపాటు ఈయూడీఏ మాజీ చైర్మన్, వైసీపీ పట్టణ అధ్యక్షులు బీ శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ మంచం మైబాబు పలువురు వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు.
తిరస్కరించారు..
గత ఎన్నికల్లో వైసీపీని ప్రజలు తిరస్కరించారని మంత్రి నారా లోకేశ్ గుర్తుచేశారు. అయినప్పటికీ ఆ పార్టీకి గుణపాఠం రాలేదని, బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ కాలం వెళ్లదీస్తోందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఏలూరు అభివృద్ధి కోసం కలిసి వచ్చేవారికి స్నేహ హస్తం అందిస్తామని స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటి అభిప్రాయ పడ్డారు. వైసీపీ కార్యకర్తలను వదిలేసి, పార్టీకి రాజీనామా చేసి ఆళ్ల నాని వెళ్లిపోయారని గుర్తుచేశారు. ఏలూరు అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేవారిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు. దశల వారీగా కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని వివరించారు.
40 మంది కార్పొరేటర్లు రెడీ
ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని వీడామని ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ వివరించారు. వైసీపీకి వెళ్లినప్పటికీ తమ మనసు తెలుగుదేశం పార్టీతోనే ఉందన్నారు. వైసీపీలో ఉండి ఏలూరును ఏమాత్రం అభివృద్ధి చేయలేక పోయామని వివరించారు. ఏలూరు అభివృద్ధి కోసం సొంత పార్టీలోకి రావాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. త్వరలో 40 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధగా ఉన్నారని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
Lokesh: తణుకు అన్న క్యాంటీన్‌పై వైసీపీ సైకో బ్యాచ్ విషప్రచారం
Byreddy: చివరకు దేవుని భూములు వదలలేదు.. బైరెడ్డి ఆగ్రహం
Read Latest AP News And Telugu News
Updated Date - Aug 27 , 2024 | 05:10 PM