ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TDP : పింఛన్ల పండగకు సర్వం సిద్ధం

ABN, Publish Date - Jun 30 , 2024 | 02:50 AM

పింఛన్ల పండగకు సర్వం సిద్ధమైంది. ఇప్పటివరకు అందుతున్న రూ.3 వేలకు అదనంగా పెంచిన రూ. వెయ్యి.. గత మూడు నెలల బకాయి రూ. 3 వేలు.. మొత్తం రూ.7 వేల సొమ్ము! నిజంగానే ప్రతి లబ్ధిదారుకూ ఇది పండగే.

  • రూ.3 వేలకు తోడు పెంచిన రూ.వెయ్యి

  • 3 నెలల అదనంతో కలిపి ఒక్కొక్కరికీ రూ.7 వేలు

  • రేపే పంపిణీ.. ఒక్కరోజే 65,18,496 మందికీ ఇచ్చేందుకు టార్గెట్‌

  • పకడ్బందీగా ఏర్పాట్లు.. పంపిణీలో నేరుగా పాల్గొననున్న చంద్రబాబు

  • రాజధాని పరిధిలోని పెనుమాకలో పింఛను అందించనున్న సీఎం

  • సోమవారం ఉదయం ఆరు గంటలకే కార్యక్రమం ప్రారంభం

  • మొత్తం రూ.4,399.89 కోట్లు విడుదల చేశాం

  • మొదటిరోజే 100% ఇవ్వాలి.. కలెక్టర్లతో వీసీలో సీఎస్‌ ఆదేశాలు

పింఛన్ల పండగకు సర్వం సిద్ధమైంది. ఇప్పటివరకు అందుతున్న రూ.3 వేలకు అదనంగా పెంచిన రూ. వెయ్యి.. గత మూడు నెలల బకాయి రూ. 3 వేలు.. మొత్తం రూ.7 వేల సొమ్ము! నిజంగానే ప్రతి లబ్ధిదారుకూ ఇది పండగే. జూలై 1 ఉదయాన్నే ప్రతి ఇంటికీ లబ్ధిని అందించేలా చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒక్కరోజులోనే మొత్తం 65,18,496 మందికీ పింఛను అందించడమే లక్ష్యంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను, ఇతర విభాగాల సిబ్బందిని పెద్దఎత్తున రంగంలోకి దించుతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పెనుమాక గ్రామంలో జరిగే పంపిణీలో స్వయంగా ముఖ్యమంత్రే పాల్గొననుండటం విశేషం.

అమరావతి, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 65,18,496 మంది లబ్ధిదారులకు ఇంటివద్దే పింఛన్ల పంపిణీకి సంబంధించి రూ. 4,399.89 కోట్లు విడుదల చేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ వెల్లడించారు. శనివారం విజయవాడ సీఎస్‌ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో దీనిపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

పింఛన్లపంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో పాటు ఇతర విభాగాల సిబ్బంది సేవలను కూడా వినియోగించుకునేలా ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వంలో మొదటిసారి పింఛన్ల పంపిణీ అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అని నిర్లక్ష్యానికి అవకాశం ఇవ్వకుండా సక్రమంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. జూలై 1న అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఉదయం 6 గంటలకు మొదటి పింఛను పంపిణీ చేయాలని సీఎస్‌ స్పష్టం చేశారు.

పింఛన్‌ సొమ్ముతోపాటు సీఎం రాసిన లేఖను కూడా లబ్ధిదారులకు తప్పనిసరిగా అందించాలని చెప్పారు. ఒకేరోజులో నూరుశాతం పింఛన్లు పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేసుకుని కనీసం 95 శాతానికి పైగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియను కలెక్టర్లు గంట గంటకూ పర్యవేక్షించాలని ఆదేశించారు. ఏప్రిల్‌, మే, జూన్‌ మాసాలకు గాను 11 కేటగిరీల్లోని పింఛనుదారులకు పెంచిన పింఛను రూ.4వేలతో పాటు బకాయిలు కూడా కలిపి పంపిణీ చేయాలని పేర్కొన్నారు.

ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేసిన మొత్తాన్ని శనివారం రాత్రిలోగా విత్‌డ్రా చేసుకోవాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా శనివారం రాత్రికి డబ్బు ఇవ్వలేకుంటే ఆ బ్యాంకులు ఆదివారం తెరిచి ఉంచి పింఛన్ల సొమ్మును డ్రా చేసి ఇవ్వాలని, దీనికి సంబంధించి లీడ్‌ డిస్ట్రిక్‌ మేనేజర్లు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్‌ ఆదేశించారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ పథకం నూతన యాప్‌ను సంబంధిత అధికారులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని చెప్పారు.

Updated Date - Jun 30 , 2024 | 03:02 AM

Advertising
Advertising