ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP High Court: నెల్లూరు జైలుకు పిన్నెల్లి

ABN, Publish Date - Jun 28 , 2024 | 03:25 AM

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు(మే 13న), మరుసటి రోజు జరిగిన దాడులకు సంబంధించిన కేసుల్లో అరెస్టయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు రిమాండ్‌ విధించడంతో ఆయన్ను నెల్లూరు సెంట్రల్‌ జైలుకు తరలించారు.

  • 14 రోజుల రిమాండ్‌ విధింపు

  • కోర్టు వద్ద టీడీపీ యువ నేతపై మాజీ ఎమ్మెల్యే దాడి

  • సెక్షన్‌ 323 కింద కేసు నమోదు

మాచర్ల టౌన్‌, జూన్‌ 27: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు(మే 13న), మరుసటి రోజు జరిగిన దాడులకు సంబంధించిన కేసుల్లో అరెస్టయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు రిమాండ్‌ విధించడంతో ఆయన్ను నెల్లూరు సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఈవీఎం ధ్వంసం, టీడీపీ వర్గీయులు, సీఐపై దాడి కేసుల్లో ముందస్తు బెయిల్‌ కోరుతూ ఆయన దాఖలుచేసిన పిటిషన్లను బుధవారం హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు ఆయన్ను అరెస్టుచేసిన సంగతి తెలిసిందే.

వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను అర్ధరాత్రి 12 గంటల సమయంలో మాచర్ల అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాస కల్యాణ్‌ ఎదుట హాజరుపరిచారు. 12:30 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు బెయిల్‌పై వాదోపవాదాలు జరిగాయి. పిన్నెల్లి తరఫున న్యాయవాది బాలసత్యనారాయణరెడ్డి వాదనలు వినిపించారు. కారంపూడి సీఐ అలహరి శ్రీనివాసరావు స్వయంగా హాజరయ్యారు.

పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం, బయటకు వచ్చాక చెరుకూరి నాగశిరోమణిపై దూషణలు, బెదిరింపు కేసుల్లో మాజీ ఎమ్మెల్యేకు బెయిల్‌ మంజూరైంది. టీడీపీ ఏజెంటు నంబూరి శేషగిరిరావుపైన, కారంపూడిలో సీఐ నారాయణస్వామిపైన దాడికి సంబంధించి నమోదైన హత్యాయత్నం (సెక్షన్‌ 370) కేసుల్లో మాత్రం న్యాయాధికారి ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. నెల్లూరు సెంట్రల్‌ జైలుకు తరలించాలని ఆదేశించారు. గురువారం వేకువజామున 4:30 గంటలకు భారీ భద్రత నడుమ పిన్నెల్లిని పోలీసులు నెల్లూరు బయల్దేరారు. ఉదయం 9.10 గంటలకు అక్కడి జైలుకు చేరుకున్నారు. జైలు అధికారులు కోర్టు ఉత్తర్వులను పరిశీలించి లోపలకు తీసుకెళ్లారు.


కోర్టు వద్ద ఉద్రిక్తత

పిన్నెల్లిని మాచర్ల కోర్టులో హాజరుపరుస్తున్నారనే సమాచారం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు బుధవారం అర్ధరాత్రి కోర్టు వద్దకు చేరుకున్నారు. 12 గంటల ప్రాంతంలో ఆయన్ను పోలీసు వాహనంలో తీసుకురాగానే పెద్దఎత్తున నినాదాలు చేశారు. తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు ఒక దశలో వారిని అదుపు చేయలేకపోయారు. ఆందోళనల నడుమే ఆయన్ను కోర్టు మెయిన్‌ గేటు ద్వారా లోపలకు తీసుకెళ్లారు. అంతకుముందు పిన్నెల్లి వాహనం దిగి వైసీపీ కార్యకర్తలతో కరచాలనం చేస్తుండగా అదే సమయంలో అక్కడ తెలుగు యువత జిల్లా కార్యదర్శి కొమెర శివ ఎదుటపడ్డారు. మాజీ ఎమ్మెల్యే ఆగ్రహంతో తన కుడి చేతి పిడికిలి బిగించి శివ కడుపుపై పిడిగుద్దు గుద్దారు. పోలీసులు అప్రమత్తమై హుటాహుటిన పిన్నెల్లిని బలవంతంగా లోపలకు తీసుకెళ్లారు. దాడిపై శివ ఫిర్యాదు చేయడంతో పట్టణ సీఐ బొప్పన బ్రహ్మయ్య ఐపీసీ 323 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.

Updated Date - Jun 28 , 2024 | 03:27 AM

Advertising
Advertising