ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ap Health Minister : ‘108’ పేరిట కొల్లగొట్టేశారు!

ABN, Publish Date - Jun 28 , 2024 | 03:56 AM

రాష్ట్రంలో 108 వాహన సేవలను అరబిందో సంస్థ 2020 జూలై నుంచి నిర్వహిస్తోంది. 2014 నుంచి 2019 మధ్యలో ప్రభుత్వం జనాభాకు సరిపడగా 440 వాహనాలను ప్రవేశపెట్టగా..

  • ‘అరబిందో’కు అడ్డగోలుగా టెండర్‌

  • మూడేళ్లకు బదులు ఏడేళ్లకు అగ్రిమెంట్‌

  • దారుణంగా 108 వాహనాల నిర్వహణ

  • అరబిందో సంస్థ కోసమే వాహనాలను

  • భారీగా పెంచిన వైసీపీ సర్కారు

  • నేడు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సమీక్ష

  • (అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో 108 వాహన సేవలను అరబిందో సంస్థ 2020 జూలై నుంచి నిర్వహిస్తోంది. 2014 నుంచి 2019 మధ్యలో ప్రభుత్వం జనాభాకు సరిపడగా 440 వాహనాలను ప్రవేశపెట్టగా.. వైసీపీ ప్రభుత్వం అవసరానికి మించి వాహనాలను కొనుగోలు చేసింది. అరబిందోకు మేలు చేసేలా ఏకంగా 336 వాహనాలను ఒకేసారి కొని, మొత్తం వాహనాలను 768కు పెంచింది. అప్పటి వరకూ ఆరోగ్యశాఖ 108 వాహనాల నిర్వహణకు నెలకు రూ.6.31 కోట్లు ఖర్చు చేస్తే, వైసీపీ ప్రభుత్వం 108 నిర్వహణకు నెలకు దాదాపు రూ.16 కోట్లు ఖర్చు చేసింది.

ఏడాదికి దాదాపు రూ.189 కోట్లు అరబిందో సంస్థకు ప్రభుత్వం నుంచి చెల్లింపులు చేసింది. ఇప్పటికి నాలుగేళ్లల్లో దాదాపు రూ.750 కోట్లు పైగా ప్రభుత్వం అరబిందోకు చెల్లింపులు చేసింది.ఇంత భారీ మొత్తం బిల్లులు చెల్లించినా సేవలు ఏమైనా పెరిగాయా అంటే అదీ లేదు. ఈ నాలుగేళ్లలో అరబిందో సంస్థ కేవలం 50 లక్షల మందిని మాత్రమే తమ అంబులెన్స్‌ల్లో ఆస్పత్రులకు తరలించింది. అసలు అరబిందో సంస్థకు చెల్లిస్తున్న బిల్లులకు, వారు చేస్తున్న సేవలకు అసలు పొంతనే ఉండదు.

అయినా అధికారులకు మాత్రమ అరబిందో సంస్థ అంతా సక్రమంగా చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక, ప్రభుత్వం ప్రయివేటు సంస్థకు టెండర్‌ ఇచ్చే క్రమంలో గరిష్టంగా మూడేళ్లే గడువు ఇస్తుంది. ఆ తర్వాత సదరు సంస్థ విధుల ఆధారంగా ప్రభుత్వానికి నచ్చితే ఏటా గడువు పొడిగిస్తారు. ఇలా అత్యధికంగా ఐదేళ్లకు మించి టెం డర్‌ ఇవ్వడానికి లేదు. కానీ ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఒకేసారి ఏడేళ్లకు అరబిందోకు టెండర్‌ కట్టబెట్టడం విశేషం.


డయాలసిస్‌ రోగులే టార్గెట్‌

అరబిందో సంస్థ 108 అంబులెన్సుల నిర్వహణ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అత్యంత తెలివిగా ప్రవర్తించింది. టెండర్‌ నిబంధనల ప్రకారం ప్రతి అంబులెన్సులో రోజుకు నలుగురు రోగులను ఆస్పత్రులకు తరలించాలి. అంటే 768 వాహనాల్లో దాదాపు 3 వేల మంది రోగులను ఆస్పత్రులకు తరలించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఈ స్థాయిలో అంబులెన్స్‌ సేవలు అవసరముండదు. గ్రామీణ, అర్బన్‌ ప్రాంతాల్లో మినహా, గిరిజన ప్రాంతాల్లో అంబులెన్సుల సేవలు ఎక్కువగా ఉపయోగించుకునే పరిస్థితి ఉండదు.

ఒకవైపు లెక్కకు మించి వాహనాలు పెరిగినా, ఆ స్థాయిలో కేసులు లేకపోవడంతో అరబిందో సంస్థ తెలివిగా ఆలోచించింది. 108 అంబులెన్సులను కేవలం రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, గర్భిణిల అత్యవసర సమయంలో మాత్రమే ఉపయోగించాలి. కానీ, డయాలసిస్‌ రోగులు, గర్భిణిలను కూడా 108 వాహనాల్లో ప్రభుత్వాసుపత్రులకు తరలించి అక్కడ వారికి చికిత్స అందించి, తిరిగి వారిని ఇంటిలో దించే వరకూ అంబులెన్సులను ఉపయోగించుకునేవారు. మరో దారుణం ఏమిటంటే ఒక 108 అంబులెన్స్‌ డయాలసిస్‌ రోగిని ఆస్పత్రికి తీసుకువెళ్లే క్రమం.. ఆ అంబులెన్స్‌ పరిధిలో రోడ్డు ప్రమాదం ఏదైనా జరిగినా ఇక పట్టించుకునే వారు కాదు.

నిబంధనలు మీరినా.. పెనాల్టీలు ఉండవు!

అరబిందో సంస్థ పెనాల్టీలకు అతీతం. సదరు సంస్థ అంబులెన్స్‌ నిర్వహణతో పాటు కాల్‌ సెంటర్‌కు కాల్‌ వచ్చిన తర్వాత అర్బన్‌ ప్రాంతాల్లో 15 నిమిషాల్లోపు, రూరల్‌ ప్రాంతాల్లో 20 నిమిషాల లోపు, గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల లోపు ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకోవాలి. ఇలా చేరుకోలేని పక్షంలో భారీగా పెనాల్టీలు విధించాలి. అంబులెన్స్‌కు నెలవారీగా చెల్లించిన బిల్లుల్లో 0.1% పెనాల్టీ విధించాలి.

కానీ ఏ రోజూ ఆరోగ్యశాఖ అధికారులు పెనాల్టీలు విధించిన పరిస్థితి లేదు. ప్రతి క్వార్టర్‌కు అరబిందోకు రూ.40 కోట్ల వరకూ బిల్లులు చెల్లిస్తారు. అధికారులకు అరబిందోపై ఉన్న ప్రేమతో క్వార్టర్‌కు 1.5ు లేదా 1 శాతానికి మించిన పెనాల్టీలు విధించలేదు. ఇందుకు అధికారులకు నెలవారీ మామూళ్లందేవని చెబుతారు.

ఇలా చెప్పుకుంటూ పోతే అరబిందో సంస్థ తప్పులు అన్నీ ఇన్నీ కావు.. ప్రభుత్వ అండదండలు, ప్రశ్నించాల్సిన అధికారుల సపోర్టుతో సంస్థ అడిందే ఆట పాడిందే పాటగా మారింది. కాగా, 108ల నిర్వహణ, అరబిందో సంస్థ కాంట్రాక్టు వ్యవహారంపై శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సమీక్షించనున్న నేపథ్యంలో గత ప్రభుత్వంలో జరిగిన ఉల్లంఘనలన్నీ చర్చకొచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Jun 28 , 2024 | 03:58 AM

Advertising
Advertising