ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YSRCP: పవన్ అన్నదేంటి? ప్రచారం చేస్తున్నదేంటి? దీనికంటే దిగజారుడు మరొకటి ఉంటుందా?

ABN, Publish Date - Feb 29 , 2024 | 10:09 AM

వైసీపీ ఎంతకైనా దిగజారుతుందనడానికి ఇదే నిదర్శనం. ఇప్పటి వరకూ కాపు నేత హరిరామ జోగయ్యతో చిలక పలుకులు పలికిస్తున్నది వైసీపీయే అని టాక్. అది చాలదన్నట్టు ప్రతి ఒక్క విషయంలోనూ వేలు పెట్టి మార్పులు చేర్పులు చేసి టీడీపీ జనసేనలను జనాల్లో పలుచన చేసేందుకు తెగ ట్రై చేస్తోంది. నిన్న మొన్నటి వరకూ పొత్తు విచ్ఛిన్నానికి నానా తంటాలు పడింది.

అమరావతి: వైసీపీ (YCP) ఎంతకైనా దిగజారుతుందనడానికి ఇదే నిదర్శనం. ఇప్పటి వరకూ కాపు నేత హరిరామ జోగయ్యతో చిలక పలుకులు పలికిస్తున్నది వైసీపీయే అని టాక్. అది చాలదన్నట్టు ప్రతి ఒక్క విషయాన్నీ మార్పులు చేర్పులు చేసి టీడీపీ (TDP), జనసేన (Janasena)లను జనాల్లో పలుచన చేసేందుకు తెగ ట్రై చేస్తోంది. నిన్న మొన్నటి వరకూ పొత్తు విచ్ఛిన్నానికి నానా తంటాలు పడింది. అది సాధ్యం కాదని తెలియడంతో వ్యూహాలకు పదును పెట్టి మరీ టీడీపీ, జనసేనలపై కల్పిత కథనాలను వైసీపీ సోషల్ మీడియా (Social Media) వింగ్ ప్రచారం చేస్తోంది.

టీడీపీ–జనసేన పొత్తు తాడేపల్లి ప్యాలెస్‌ (Tadepalli Palace)ను కకావికలం చేస్తోందని... రాష్ట్ర ప్రయోజనాల కోసం, వివిధ వర్గాల భవిష్యత్తు కోసం తాము కలిశామని.. కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించండి.. గెలిపించండంటూ టీడీపీ–జనసేన అధినేతలు చంద్రబాబు (Chandrababu), పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు వద్ద జరిగిన భారీ సభలో వీరిద్దరూ ప్రసంగించారు. ఈ ప్రసంగం తర్వాత వైసీపీ సోషల్ మీడియా రెచ్చిపోయింది. పవన్ పేరిట ఓ లేఖను తెగ వైరల్ చేస్తోంది. పవన్ వ్యాఖ్యలను పూర్తిగా మార్చేసి మరీ ప్రచారం ప్రారంభించింది.

‘‘నాకు ఎవరి సలహాలు అక్కరలేదు. ఇటీవల సలహాలు ఇస్తూ బహిరంగ లేఖలు రాస్తున్నారు. కొందరు సీనియర్ల లేఖలు పొత్తుపై ప్రభావం చూపుతున్నాయి. ఒంటరిగా పోటీ చేసే శక్తి ఇప్పటికిప్పుడు జనసేనకు లేదు. నాపై విమర్శలు చేసే వారు ముందుగా దీనిపై ఆలోచించాలి’’ అని పవన్ వ్యాఖ్యానిస్తే.. దానిని పూర్తిగా మార్చేసి.. ‘24 సీట్లతో ఏకీభవించండి.. లేదా వైసీపీకి వెళ్లిపోండి’ అని పవన్ అన్నారంటూ ప్రచారం చేస్తున్నారు. పవన్ లెటర్ ప్యాడ్‌పై ఆయన సంతకాన్ని మాత్రం అలా ఉంచేసి మ్యాటర్ అంతా మార్చేశారు. పొత్తు ధర్మం పాటించని కార్యకర్తలు జనసేనకు అవసరం లేదని.. జెండాలు మోయడం బరువైతే అధికార పార్టీలోకి వెళ్లిపోవాలంటూ పవన్ అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. జనసేన నేతలు, కార్యకర్తలను కావాలంటే నేరుగానే పార్టీలోకి ఆహ్వానించవచ్చు.. మరీ ఇంత దిగజారుడు రాజకీయమా? అని జనం విస్తుబోతున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 29 , 2024 | 10:09 AM

Advertising
Advertising