Chandrababu Naidu: 'ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు'
ABN, Publish Date - Dec 11 , 2024 | 07:43 PM
ఏపీ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అంతేకాదు రైతులకు డబ్బులు కూడా 24 గంటల్లోనే అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్రంలో ధాన్యం (Paddy) కొనుగోలు సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అధికారులను ఆదేశించారు. దీంతోపాటు 24 గంటల్లోనే రైతులకు అందుకు సంబంధించిన డబ్బులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు చేసే క్రమంలో ఒక్క కేజీ కూడా తడవకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వ్యవసాయ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లదేనని సీఎం పేర్కొన్నారు.
ఎక్కడైనా సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించాలని అధికారులకు తెలిపారు. ఆ క్రమంలో అధికారులు, రైస్ మిల్లర్ల వల్ల రైతులు ఏదైనా ఇబ్బందులు పడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. గత ప్రభుత్వ హాయాంలో తడిసిన ధాన్యం అమ్ముకునేందుకు రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ ఈసారి మాత్రం రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
అధికారుల మధ్య సమన్వయ లోపం
మరోవైపు దీపం2 పథకం పంపిణీపై కూడా సీఎం అధికారులకు చురకలంటించారు. అధికారుల మధ్య సంబంధం లేకుండా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాల్లో ఎంతమందికి ఉచిత గ్యాస్ అందుతుంది, ఎంతమందికి డబ్బులు పడ్డాయన్న వివరాలలో అధికారుల మధ్యనే కన్ఫ్యూజన్ ఉందన్నారు. పూర్తిగా తెలుసుకుంటామని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు చెప్పగా, దాదాపు 6700 మందికి ఇంకా గత నెలలో ఇచ్చిన గ్యాస్ డబ్బులు పడలేదని కమిషనర్ వీర పాండ్యన్ చెప్పారని సీఎం ప్రస్తావించారు. ఈసారి సమావేశంలో అధికారులు అంతా కలిసి ఒకే సమాచారం ఇవ్వాలన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సమాచారం ఇవ్వొద్దని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
ఇవి కూడా చదవండి...
High Court: హెల్మెట్లు వాడకపోవడంపై హైకోర్టు సీరియస్.. చలానా చెల్లించకుంటే వాటర్ కట్
Pawan: ప్రతీసారి మీ సామర్థ్యాన్ని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు
AP highcourt: అదానీతో విద్యుత్ ఒప్పందాలపై హైకోర్టులో విచారణ.. ఏం జరిగిందంటే
Read Latest AP News And Telugu News
Updated Date - Dec 11 , 2024 | 07:51 PM