ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విచారణకు వర్మ డుమ్మా!

ABN, Publish Date - Nov 20 , 2024 | 03:31 AM

సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ పోలీసు విచారణకు డుమ్మాకొట్టారు. మంగళవారం ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్‌ సర్కిల్‌ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాల్సిన ఆయన.. తనకు షూటింగ్‌ ఉన్నందున నాలుగు రోజులు గడువు కావాలని కోరుతూ విచారణాధికారికి వాట్సాప్‌ ద్వారా మెసేజ్‌ చేశారు.

  • షూటింగ్‌ ఉందని గడువుకు విన్నపం

  • మళ్లీ నోటీసులకు పోలీసులు రెడీ

  • మరోసారి హైకోర్టుకు దర్శకుడు

  • ముందస్తు బెయిల్‌ కోరుతూ పిటిషన్‌

ఒంగోలుక్రైం/అమరావతి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ పోలీసు విచారణకు డుమ్మాకొట్టారు. మంగళవారం ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్‌ సర్కిల్‌ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాల్సిన ఆయన.. తనకు షూటింగ్‌ ఉన్నందున నాలుగు రోజులు గడువు కావాలని కోరుతూ విచారణాధికారికి వాట్సాప్‌ ద్వారా మెసేజ్‌ చేశారు. అదేవిధంగా తన తరఫు న్యాయవాది ఎన్‌. శ్రీనివాసరావు ద్వారా లేఖ పంపారు. ఈ నేపథ్యంలో మరోసారి వర్మకు నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. సామాజిక మధ్యమాలలో అనుచిత, అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ వర్మపై రెండు తెలుగు రాష్ట్రాలో 10 కేసులు నమోదైనట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లపై అసభ్యకరంగా సోషల్‌ మీడియాలో వర్మ పోస్టులు పెట్టారు. మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో టీడీపీ మండల కార్యదర్శి ముత్తనపల్లి రామలింగయ్య ఫిర్యాదుచేయడంతో వర్మకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. దీంతో కేసును కొట్టివేయాలని వర్మ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు. వర్మ మంగళవారం విచారణకు రావాల్సి ఉండగా, ముందుగా నిర్ణయించుకున్న షెడ్యులు ప్రకారం సినిమా షూటింగ్‌లు ఉన్నాయని, నాలుగు రోజులు గడువు కావాలని కోరుతూ విచారణాధికారి ఎన్‌. శ్రీకాంత్‌బాబుకు వాట్సాప్‌ సందేశం పంపించారు. మంగళవారం మరోసారి వర్మ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని అభ్యర్థించారు.

Updated Date - Nov 20 , 2024 | 03:31 AM