ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బ్యాంకాక్‌ నుంచి విదేశీ బల్లులు

ABN, Publish Date - Nov 28 , 2024 | 05:21 AM

బ్యాంకాక్‌ నుంచి విమానంలో అక్రమంగా తీసుకొచ్చిన విదేశీ బల్లులను విశాఖ విమానాశ్రయంలో కస్టమ్స్‌, రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.

  • లగేజీలో కేక్‌ బాక్సుల్లో పెట్టి తరలింపు

  • విశాఖ విమానాశ్రయంలో స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్‌

విశాఖపట్నం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): బ్యాంకాక్‌ నుంచి విమానంలో అక్రమంగా తీసుకొచ్చిన విదేశీ బల్లులను విశాఖ విమానాశ్రయంలో కస్టమ్స్‌, రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇద్దరిని అరెస్టు చేశారు. బ్యాంకాక్‌ విమాన ప్రయాణికుల లగేజీని పరిశీలిస్తున్నప్పుడు చిన్న చిన్న పెట్టెల్లో (కేక్‌ బాక్సులు) ఏవో జంతువులు కదలాడుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో విశాఖపట్నంలో పాములు పట్టే (స్నేక్‌ క్యాచర్‌) రొక్కం కిరణ్‌ కుమార్‌ను పిలిపించి వాటిని బయటకు తీయించగా.. విదేశీ బల్లులు కనిపించాయి. వాటిలో మూడింటి నాలుకలపై నీలం రంగు మచ్చలు ఉన్నాయి. మరో మూడు వెస్టర్న్‌ నీలం రంగు నాలుకతో ఉన్నాయి. వీటి కాళ్లు పొట్టిగా, తోక చిన్నదిగా, శరీరం బలిష్టంగా ఉంది. ఈ తరహా బల్లులు ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఉంటాయని, అడవుల్లో గడ్డి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కనిపిస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా ఇద్దరిని అరెస్టు చేసినట్టు తెలిపారు. అయితే వారు ఎవరు.. ఏ దేశానికి చెందినవారు.. ఈ బల్లులను ఎందుకు తీసుకువస్తున్నారు..? అనే వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఈ కేసును విమానాశ్రయం పోలీస్‌ స్టేషన్‌ అధికారులకు అప్పగిస్తున్నట్టు రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ పూజా పుంద్కర్‌, అటవీ శాఖ అధికారి ఎస్‌ వెంకటేశ్‌ తెలిపారు.

Updated Date - Nov 28 , 2024 | 05:22 AM