జ్యుడీషియల్ అధికారుల రాష్ట్ర అధ్యక్షుడిగా చక్రపాణి ఎన్నిక
ABN, Publish Date - Aug 19 , 2024 | 05:16 AM
జ్యుడీషియల్ అధికారుల రాష్ట్ర అధ్యక్షుడిగా జి.చక్రపాణి ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం గుంటూరు ఫ్యామిలీ కోర్టులో జడ్జిగా సేవలందిస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీ జ్యుడీషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్‌కు ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి.
అమరావతి, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): జ్యుడీషియల్ అధికారుల రాష్ట్ర అధ్యక్షుడిగా జి.చక్రపాణి ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం గుంటూరు ఫ్యామిలీ కోర్టులో జడ్జిగా సేవలందిస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీ జ్యుడీషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్‌కు ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. ఈ నెల 14న ఎన్నికలు నిర్వహించారు. ఆదివారం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా టి.లీలావతి, కె.శైలజ, జె.శ్రీనివాసరావు గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా ఎన్.రమేష్ నాయుడు, సంయుక్త కార్యదర్శులుగా ఎం.ప్రదీ్‌పకుమార్, ఎ.కృష్ణప్రసాద్, జి.కార్తిక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గసభ్యులుగా బి.లీలా వెంకటశేషాద్రి, ఎస్‌పీడీ వెన్నెల, బి.రాధారాణి, డాక్టర్ సీహెచ్ శ్రీనివాసబాబు ఎన్నికయ్యారు. సీనియర్ న్యాయవాది విరూపాక్ష దత్తాత్రేయ గౌడ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.
Updated Date - Aug 19 , 2024 | 05:17 AM