ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Srisailam: మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్.. తెల్లరేషన్ కార్డు ఉంటే..

ABN, Publish Date - Sep 05 , 2024 | 07:32 PM

ప్రముఖ శైవ క్షేతం శ్రీశైలం. ఆ శ్రీశైలంలో కొలువు తీరిన శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు శనివారం నుంచి.. అంటే సెప్టెంబర్ 07వ తేదీన నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి.

నంద్యాల, సెప్టెంబర్ 05: ప్రముఖ శైవ క్షేతం శ్రీశైలం. ఆ శ్రీశైలంలో కొలువు తీరిన శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు శనివారం నుంచి.. అంటే సెప్టెంబర్ 07వ తేదీన నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ మహోత్సవాల్లో భాగంగా.. లోక కళ్యాణార్థం ఈ నెల 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రత్నగర్భ గణపతికి, సాక్షి గణపతికి యాగశాలలోని పంచలోహమూర్తికి వ్రత కల్ప విశేషార్చనలు చేయనున్నారు.

Also Read: Vinayaka Chavithi Special 2024: ముస్లిం దేశాల్లో పూజలందుకొంటున్న ‘గణపతి’


సాక్షి గణపతి వద్ద మృత్తికా గణపతి విగ్రహాన్ని నెలకొల్పి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ధర్మ ప్రచారంలో భాగంగా సెప్టెంబర్ 7వ తేదీన నిర్వహిస్తున్న ఈ పూజల్లో తెల్లరేషన్ కార్డు కలిగిన వారికి ఉచితంగా పూజలు నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. అందుకోసం ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని భక్తులకు అధికారులు సూచించారు. ఈ గణపతి నవరాత్రి మహోత్సవాలు సెప్టెంబర్ 16వ తేదీతో ముగియనున్నాయి.

Also Read: MP Balasouri: ఏపీని ఆదుకొనేందుకు ప్రతి ఎంపీకి లేఖలు రాయండి


రత్నగర్భ వినాయకుడు..

శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో కుడివైపున ఉండే గణపతే. రత్నగర్భ వినాయకుడు. శతాబ్దాలుగా ఈ రత్నాగర్భ వినాయకుడు నిత్యం పూజలు అందుకుంటున్నట్లు పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. శ్రీశైలంలోని దేవాలయంలోకి ప్రవేశించగానే స్వామివారికి కుడివైపున ఈ రత్నగర్భ వినాయకుడికి దర్శనం చేసుకున్న అనంతరం భక్తులందరూ శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం అనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి రత్నగర్భ వినాయకుడు.. వినాయక చవితి నవరాత్రుల్లో భాగంగా భక్తుల చేత విశేష పూజలు అందుకుంటారన్న విషయం విధితమే.

Also Read:Delhi Excise Policy: సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు


సాక్షి గణపతి..

నంద్యాల జిల్లా శ్రీశైలంలో సాక్షి గణపతి దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయాలనికి 5 కిలోమీటర్ల దూరంలో ఈ సాక్షి గణపతి దేవాలయం ఉంది. ఈ సాక్షి గణపతిని దర్శించుకున్న అనంతరం శ్రీశైల మల్లికార్జున స్వామిని భక్తులు దర్శించుకోవడం పూర్వ కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: Anam Venkata Reddy: ‘రోజక్కకి ఇంకా సిగ్గు రాలేదు’

Also Read: Hyderabad: జూబ్లీహిల్స్‌లో పలు రెస్టారెంట్లపై దాడులు.. కేసులు నమోదు


తొలుత సాక్షి గణపతిని దర్శించుకోవడం అనంతరం శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం వెనుక ఓ నమ్మకం అయితే బలంగా ప్రచారంలో ఉంది. మల్లన్న దర్శనానికి ముందే సాక్షి గణపతి దర్శించుకుంటే తాము ఇక్కడికి వచ్చినట్లు వినాయకుడే స్వయంగా మల్లికార్జునస్వామికి చెబుతాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.

Also Read: Ravindra Jadeja: బీజేపీలో చేరిన స్టార్ క్రికెటర్.. ఫొటో షేర్ చేసిన రివాబా

Read More National News and Latest Telugu New

Updated Date - Sep 05 , 2024 | 07:36 PM

Advertising
Advertising